Avneet Kaur : టామ్ క్రూజ్‌ని క‌లిసిన‌ న‌టి అవ్నీత్ కౌర్.. ‘క‌ల నిజ‌మైంది’ అంటూ పోస్ట్‌.. పిక్స్ వైర‌ల్‌

హాలీవుడ్ న‌టుడు టామ్ క్రూజ్‌ను క‌లుసుకున్న‌ట్లు న‌టి, సోషల్ మీడియా సంచలనం అవ్నీత్ కౌర్ వెల్ల‌డించింది.

Avneet Kaur : టామ్ క్రూజ్‌ని క‌లిసిన‌ న‌టి అవ్నీత్ కౌర్.. ‘క‌ల నిజ‌మైంది’ అంటూ పోస్ట్‌.. పిక్స్ వైర‌ల్‌

Avneet Kaur meets Tom Cruise on the sets of Mission Impossible

Updated On : November 12, 2024 / 9:59 AM IST

Avneet Kaur – Tom Cruise : హాలీవుడ్ న‌టుడు టామ్ క్రూజ్‌ను క‌లుసుకున్న‌ట్లు న‌టి, సోషల్ మీడియా సంచలనం అవ్నీత్ కౌర్ వెల్ల‌డించింది. త‌న క‌ల నిజ‌మైన‌ట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సైతం పోస్ట్ చేసింది. ఆయ‌న న‌టిస్తున్న మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ మూవీ సెట్‌లో కలుసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇంకా ఇది న‌మ్మ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పుకొచ్చింది. యాక్ష‌న్ హీరో విన్యాసాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌డం ఎంతో అద్భుతంగా ఉందని తెలిపింది.

అవ్నీత్ కౌర్..తెల్ల‌టి చొక్కా, న‌ల్ల‌ని స్క‌ర్ట్ ధ‌రించగా టామ్ క్రూజ్ నీలిరంగు టీష‌ర్టు, న‌లుపు రంగు ట్రాక్ ప్యాంట్‌లో క‌నిపించారు. ఫోటో కోసం టామ్ క్రూజ్ ఆమె భుజం పై చేయి వేసి ఫోజులు ఇచ్చారు. మ‌రో ఫోటోలో వీరిద్ద‌రు మాట్లాడుకుంటున్న‌ట్లుగా ఉంది.

Indian 3: ఇండియన్-2 ఫెయిల్యూర్‌ను మరిపించేలా ఇండియన్-3 రాబోతుందా?

“నేను ఇంకా ఆశ్చ‌ర్యంలోనే ఉన్నాను. టామ్ క్రూజ్ న‌టిస్తున్న మిష‌న్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ సెట్‌ను సంద‌ర్శించే అద్భుత‌మైన అవ‌కాశం నాకు వ‌చ్చింది. చిత్రనిర్మాణ మాయాజాలాన్ని ప్రత్యక్షంగా చూడడం విస్మయం కలిగించింది. టామ్ చేసే నిజ‌మైన విన్యాసాలు సినిమా ప‌ట్ల అత‌డికి ఉన్న అంకిత‌భావాన్ని తెలియ‌జేస్తుంది. ఈ చిత్రం 23 మే 2025 విడుద‌ల కానుంది. మ‌రిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి.” అని అవ్నీత్ కౌర్ రాసుకొచ్చింది.

Sandeep Raaj : నిశ్చితార్థం చేసుకున్న యువ డైరెక్టర్.. ఆ నటితో ప్రేమలో పడి..

అయితే.. ఆమె సినిమాలో న‌టిస్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. దీనిపై మాత్రం ఆమె స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)