Indian 3: ఇండియన్-2 ఫెయిల్యూర్‌ను మరిపించేలా ఇండియన్-3 రాబోతుందా?
ఇండియన్-2 శంకర్ గ్రాప్‌ను బానే డ్యామేజ్ చేసింది. అయినా ఇండియన్-3 ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించేందుకే శంకర్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కమల్ హాసన్ హీరోగా..డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా భారతీయుడు ఓ సెన్సేషన్. 1996 రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. దానికి సీక్వెల్‌గా ఇటీవలే ఇండియన్-2 రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. ఇప్పుడు ఇండియన్-3 వస్తుందనే టాక్ మొదలైంది.
ఇండియన్-2 శంకర్ గ్రాప్‌ను బానే డ్యామేజ్ చేసింది. అయినా ఇండియన్-3 ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించేందుకే శంకర్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ చేసిన కొన్ని మార్పులు చేర్పులతో కొంత షూట్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే షూట్ ఉంటుందని న్యూస్ వైరల్ అవుతోంది. సినిమా యూనిట్ ఇండియన్-3 విషయంలో ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.
ఇండియన్-2 సినిమా చివరిలో చూపించిన ఇండియన్-3 సీన్స్ మాత్రం కొంత ఆసక్తికరంగా అనిపించాయి. కానీ ఇండియన్-2 ఫెయిలవడంతో ఆ ప్రభావం ఇండియన్-3 మీద గట్టిగానే పడింది. దాంతో ఇండియన్-2 ఫెయిల్యూర్‌ను మరిపించేలా ఇండియన్-3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు శంకర్, కమల్ హాసన్ టీం కసరత్తులు చేస్తున్నాయట. గేమ్‌ఛేంజర్ రిలీజ్ తర్వాత ఇండియన్-3 చేస్తాడా..లేక ఒకవైపు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి మరోవైపు మిగిలిన పార్ట్ షూటింగ్ చేస్తాడా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.