Supar star Mahesh Babu and Satyadev as brothers voice for that movie
Mahesh Babu-Satyadev : హాలీవుడ్ ఫేమస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ అయిన ముఫాసా ఇప్పుడు తెలుగులో కూడా రాబోతుంది. ఇకపోతే తెలుగు వెర్షన్ ముఫాసా కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఎప్పుడో దీని గురించి మహేష్ బాబు వెల్లడించడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Also Read : Aryan Khan : సొంత బ్యానర్ లోనే కొడుకుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న షారుఖ్..
ఇకపోతే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ఈ రోజు ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే మహేష్ బాబు ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక పోస్టర్ లో ఏ పాత్రకి ఎవరు డబ్బింగ్ చెప్పారో పేర్కొన్నారు. ‘ముఫాసా కోసం మహేష్ బాబు, టిమోన్ కోసం అలీ, పంబా కోసం బ్రహ్మానందం, టాకా కోసం సత్య దేవ్ వాయిస్ లను అందించారని చెప్పారు’. అలాగే మహేష్ బాబు తన ఎక్స్ వేదికగా.. మరో నెల రోజుల్లో ముఫాసా రాబోతుంది.. చూసేందుకు రెడీ గా ఉండండి అంటూ పేర్కొన్నాడు.
ఇక ఈ సినిమాలో ముఫాసా, టాకా రెండూ అన్నదమ్ముల పాత్రలో కనిపిస్తారు. ఈ రెండూ అన్న దమ్ముల పాత్రకి మహేష్, సత్యదేవ్ వాయిస్ అందించారు. అన్నదమ్ముల లాగా మహేష్, సత్యదేవ్ వాయిస్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. జెంకిన్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని ముఫాసా పాత్రకి తెలుగులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పగా, హిందీలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వాయిస్ చెప్పారు. ఇక మహేష్ బాబు తెలుగులో డబ్బింగ్ చెప్పడంతో దీని గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు తెలుగు ఆడియన్స్. ట్రైలర్ సైతం బాగుండడంతో దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ లో ముఫాసాగా మహేష్ బాబు ట్రైలర్ చాలా గంభీరంగా ఉంది. పుంబా గా బ్రహ్మానందం వాయిస్ సైతం సరిగ్గా సెట్ అయ్యింది. అలీ వాయిస్ కూడా చాలా కామెడీగా ఉంది .