Aryan Khan : సొంత బ్యానర్ లోనే కొడుకుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న షారుఖ్..
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఆయనకి తెలుగులో సైతం భారీ ఫ్యాన్ బేస్ ఉంది.

Shahrukh khan is introducing his son Aryan Khan as a director under his own banner
Aryan Khan : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఆయనకి తెలుగులో సైతం భారీ ఫ్యాన్ బేస్ ఉంది. వేలకోట్లకు అధిపతైన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్. ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ, తరచూ తన తండ్రితో కనిపిస్తుంటాడు. అంతేకాదు ఇప్పటికే ఓ సారి డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాడు.
Also Read :AR Rahman Divorce : విడాకుల వేళ రెహమాన్ మతం మారడంపై విమర్శలు.. కానీ గతంలోనే క్లారిటీ..
ఇదిలాఉంటే షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా తన తండ్రిలాగే సినీ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. కానీ హీరోలా అనుకునేరు. కాదు డైరెక్టర్ లాగా. తన తండ్రికి భిన్నంగా డైరెక్టర్ గా మారి వెబ్ సిరీస్ తీస్తున్నాడు. తన డెబ్యూ వెబ్ సిరీస్ తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ కూడా విడుదల చేసారు. నెట్ ఫ్లిక్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సిరీస్ రానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో చూడని సరికొత్త సిరీస్ ను మీ ముందుకు ప్రవేశపెడతాం అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. 2025లో ఈ సిరీస్ వస్తుందని అన్నారు. ఇక ఈ సిరీస్ తో ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు సంతోషిస్తున్నారు షారుఖ్ ఫ్యాన్స్.
View this post on Instagram
అయితే సాధారణంగా సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన స్టార్ కిడ్స్ చాలా మంది తమ పేరెంట్స్ మాదిరి హీరోనో, హీరోయినో అవ్వాలనుకుంటారు. చాలా మంది అయ్యారు కూడా. కానీ షారుఖ్ కొడుకు మాత్రం తన తండ్రి పెద్ద హీరో అయినప్పటికీ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. మరి తండ్రిలా హీరో కాకుండా డైరెక్టరై ఆర్యన్ ఖాన్ సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి.