AR Rahman Divorce : విడాకుల వేళ రెహమాన్ మతం మారడంపై విమర్శలు.. కానీ గతంలోనే క్లారిటీ..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ తన భార్య సైరా బాను తో విడాకులు ప్రకటించారు.

AR Rahman Divorce : విడాకుల వేళ రెహమాన్ మతం మారడంపై విమర్శలు.. కానీ గతంలోనే క్లారిటీ..

Criticism on Rahman conversion at the time of divorce but he gave clarity in the past

Updated On : November 20, 2024 / 3:07 PM IST

AR Rahman Divorce : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ తన భార్య సైరా బాను తో విడాకులు ప్రకటించారు. దాదాపుగా 30 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలికారు ఈ జంట. ఉన్నట్టుండి ఈ జంట విడాకులు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇన్ని సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇంత సడన్ గా విడాకులు ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే విడాకుల విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో.. రెహమాన్ కేవలం తన భార్య కోసమే ఇస్లాం మతంలోకి మారారని, ఇంత చేసి ఇప్పుడు భార్యతో విడాకులు తీసుకున్నారన్న పుకార్లు వస్తున్నాయి. కానీ అసలు రెహమాన్ ఇస్లాంలోకి ఎవరికోసం, ఎందుకు మారారో గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇస్లాంలోకి మారడం వెనుక ఉన్న కారణాలను ఆయన గతంలోనే తెలిపారు.

గతంలో AR రెహమాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన ఇస్లాం మతంలోకి ఎందుకు మారాలి అనుకున్నాడో తెలిపాడు. ఇస్లాంలోకి రెహమాన్ మారడం వెనక చాలా పెద్ద కథే ఉంది. అదేంటంటే.. “తన తండ్రి క్యాన్సర్ తో పోరాడుతున్నప్పుడు ఒక సూఫీ (ఇస్లాం గురువు) ఆయనకి ట్రీట్మెంట్ చేశారట. ఆ సమయంలో తనకి ఇస్లాం మతంలోకి చేరాలనే ఆలోచన వచ్చిందట. అలా ఈ సంఘటన జరిగిన దాదాపు 7, 8 ఏళ్ల తర్వాత మళ్ళీ తను అదే సూఫీని కలిశారట. ఆయనని కలిసిన తర్వాత రెహమాన్ కి ఏదో తెలియని ప్రశాంతత కలిగిందట. అప్పటి నుండి అన్ని మతాలను, అన్ని దేవుళ్ళను నమ్మాలన్న విశ్వాసం కలిగిందట.

Also Read : Satyadev : నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే అని నా ఫోన్ తీసుకొని.. చిరంజీవిపై సత్యదేవ్ కామెంట్స్.. ఇది కదా మెగాస్టార్ అంటే..

అంతేకాదు ఆయన తల్లి హిందూ కాబట్టి వారి ఇంట్లో అన్ని మతాల దేవుళ్ళ పటాలు ఉంటాయట. అదే సమయంలో ఓ హిందూ జ్యోతిష్యుడు తనకి ముస్లిం పేరు ఎలా పెట్టారో కూడా తెలిపాడు రెహమాన్. తన చెల్లెలు పెళ్లి సమయంలో ఓ జ్యోతిష్కుడి వద్దకు వెళ్లారట. అప్పుడు తన పేరు ఏమని పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగితే.. అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ రహీమ్ అని సూచించారట. ఆ పేర్లలో రెహమాన్ అనే పేరు తనకి బాగా నచ్చడంతో వెంటనే ఈ పేరు పెట్టుకున్నారట రెహమాన్. అలా ఓ హిందూ జ్యోతిష్యుడు తనకి ముస్లిం పేరు పెట్టారని తెలిపారు రెహమాన్.