A Master Piece : తెలుగులో మరో ‘సూపర్ హీరో’ సినిమా.. ‘A మాస్టర్ పీస్’.. ఈసారి శివుడితో..

'A మాస్టర్ పీస్' సినిమా మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్ కథతో సూపర్ హీరో సినిమాగా రానుంది.

Super Hero Movie with Lord Shiva Reference A Master Piece under Cinema Bandi Productions

A Master Piece : శుక్ర, మాటరాని మౌనమిది.. లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులని పలకరించిన డైరెక్టర్ సుకు పూర్వజ్ త్వరలో అరవింద్ కృష్ణ హీరోగా ‘A మాస్టర్ పీస్’ అనే సూపర్ హీరో సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, అషురెడ్డిలతో పాటు గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి పూర్వాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అవ్వగా సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ తో శ్రీకాంత్ కండ్రేగుల ఈ ‘A మాస్టర్ పీస్’ సినిమాని నిర్మిస్తున్నారు.

‘A మాస్టర్ పీస్’ సినిమా మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్ కథతో సూపర్ హీరో సినిమాగా రానుంది. ఇటీవల హనుమాన్ సినిమా సూపర్ హీరో, మైథాలజీ కాన్సెప్ట్ తో వచ్చి భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు ‘A మాస్టర్ పీస్’ సినిమాలో శివుడి రిఫరెన్స్ లు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా నేడు ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సూపర్ హీరో వెనక శివుడి రూపాలు ఉండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Raviteja 75 : రవితేజ 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఈసారి తెలంగాణ స్లాంగ్ తో.. రిలీజ్ ఎప్పుడంటే..

ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. భారీ క్లైమాక్స్ ని త్వరలోనే షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగా ఉండనున్నాయి. దీంతో హనుమాన్ సక్సెస్ అయినట్టే ఈ ‘A మాస్టర్ పీస్’ సినిమా కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.