Super Machi : రివ్యూ..

కళ్యాణ్ దేవ్, రచిత రామ్ జంటగా నటించిన ‘సూపర్ మచ్చి’ మూవీ రివ్యూ..

Super Machi : రివ్యూ..

Super Machi

Super Machi: మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు, ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన రెండవ సినిమా.. ‘సూపర్ మచ్చి’.. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, పులి వాసుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిజ్వాన్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..

Bangarraju : రివ్యూ..

కథ..
రాజు (కళ్యాణ్ దేవ్).. ఎలాంటి బాధ్యత లేకుండా స్నేహితులతో కలిసి జల్సాగా తిరుగుతూ.. బార్‌లో పాటలు పాడుతుంటాడు.. ఇదిలా ఉంటే రాజును ప్రేమించానని మీనాక్షి (రచిత రామ్) అనే యువతి వెంటపడుతుంటుంది. ఆమె ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే మీనాక్షి తనను పిచ్చిగా ప్రేమిస్తున్నప్పటికీ రాజు ఆమెను పట్టించుకోకుండా తన ప్రేమను తిరస్కరిస్తుంటాడు. అయితే మీనాక్షిని వదిలించుకోవడానికి ఒక రాత్రి గడిపితే నీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకొంటానని కండిషన్ పెడుతాడు. చదువు సంధ్య లేని రాజు ప్రేమ కోసం మీనాక్షి ఎందుకు తపించింది? ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? రాజును ప్రేమించడానికి కంటే ముందు మీనాక్షి చూడకుండా ప్రేమించిన వ్యక్తి ఎవరు? చూసుకోకుండానే ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన యువకుడిని మీనాక్షి ఎందుకు వదులుకుంది? మీనాక్షి, రాజు ఒక్కటయ్యారా? లేదా అజ్ఞాత ప్రేమికుడికే మీనాక్షి చేరువైందా? అనేది మిగతా కథ..

Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

నటీనటులు..
బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడిగా కళ్యాణ్ దేవ్ మంచి వేరియేషన్స్ చూపించాడు. అయితే దర్శకుడు కళ్యాణ్ దేవ్‌లోని టాలెంట్‌ను మరింత వెలికి తీసి ఉంటే డిఫినెట్‌గా హీరోకు మంచి పేరు వచ్చి ఉండేది. రాజు పాత్రలో ఆయన ఒదిగిపోయి తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నించారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. రెండో సినిమాలోనే రకరకాల ఎమోషన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. ఫైట్స్, డ్యాన్సులు బాగా చేశాడు. ఇక సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించిన మీనాక్షి పాత్రలో రచిత రామ్ ఆకట్టుకుంది. ఫస్టాఫ్ మొత్తం తన ప్రతిభతో అలరించే ప్రయత్నం చేసింది. అందం, అభినయంతో మెప్పించే ప్రయత్నం చేసింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లలో రచిత రామ్ నటన బాగుంది. తన పాత్ర పరిధి మేరకు తగిన న్యాయం చేసింది.

Super Machi : చిరు చిన్నల్లుడి రెండో సినిమా ట్రైలర్ చూశారా..

సాంకేతిక నిపుణులు..

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మార్తాండ్ కె వెంకటేష్ కత్తెర పదును సెకాండఫ్‌లో కాస్త తగ్గిందనే చెప్పాలి. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. బ్రహ్మ కడలి ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. ఇక భావోద్వేగమైన కథను ప్రేక్షకుడికి అందించాలనే తపన రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కనిపించింది. రిజ్వాన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి. కథకు, పాత్రలకు తగిన నటీనటులు ఎంపిక విధానం చూస్తే.. సినిమాపై వారికి ఉన్న అభిరుచి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. సినిమాలో ప్రోడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడానికి ఎక్కడా రాజీ పడలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కథ, కథనాల్లో కొన్ని లోపాలను సరిదిద్దుకొంటే మంచి ప్రేమ కథ అయి ఉండేది.

ఓవరాల్‌గా..

పండుగ సమయంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించే ప్రయత్నం చేసిన నిర్మాత రిజ్వాన్ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ప్రేమ, ఎమోషన్స్, ఫాదర్, డాటర్ సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. ఎలాంటి అశ్లీలత, బూతు, ద్వందార్థాలు లేని క్లీన్.. ఫెయిర్ చిత్రం ‘సూపర్ మచ్చి’. కథనం విషయాలో అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయి. అది తప్పితే సినిమా ఎంటర్‌టైనింగ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుంది.