Bangarraju : రివ్యూ..

కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన క్రేజీ ఫిలిం ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ..

Bangarraju : రివ్యూ..

Bangarraju

Bangarraju: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన క్రేజీ ఫిలిం ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌ కాగా, జీ5 సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించారు.

అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేసి, ఎట్టి పరిస్థితిలోనూ 2022 సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’ ని నిలపాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాగ్. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాలతో పోటీకి కూడా వెనుకాడలేదు. కట్ చేస్తే.. అనుకోని పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాలు పక్కకు తప్పుకోవడంతో ‘బంగార్రాజు’ కి లైన్ క్లియర్ అయింది. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

కథ..
‘బంగార్రాజు’ కొడుకు డాక్టర్ రాము (నాగార్జున) భార్య సీత (లావణ్య త్రిపాఠి) ఓ బాబుకి జన్మనిచ్చి కన్నుమూస్తుంది. దీంతో శివపురంలో ఉంటే భార్య జ్ఞాపకాలు వెంటాడతాయని, మనవణ్ణి నువ్వే పెంచమని, తాను అమెరికా వెళ్లిపోతానని, అప్పుడప్పుడు వచ్చి కొడుకుని చూస్తానని అమ్మ సత్యభామ (రమ్యకృష్ణ) కి చెప్పి వెళ్లిపోతాడు రాము.భర్త మీద ప్రేమతో మనవడి (నాగ చైతన్య) కి ‘బంగార్రాజు’ అని పేరు పెడతారు. పేరు మాత్రమే కాదు పోలికలు కూడా తాతవే వస్తాయి. మీసాలు రాకుండానే సరసాలు మొదలెడతాడు బుల్లి బంగార్రాజు. హత్య చేయబడి నరకానికి వెళ్లిన ‘బంగార్రాజు’ (నాగార్జున)ని యముడు స్వర్గంలోకి అనుమతిస్తాడు. శివపురానికి ఆపద సంభవించబోతోందని, దాన్ని ఆపాలంటే ‘బంగార్రాజు’ భూలోకానికి వెళ్లాల్సిందేనని ఇంద్రుడితో చర్చించి అతణ్ణి భూలోకానికి పంపుతాడు యముడు.

Nagarjuna : ‘బంగార్రాజు’కి కూడా సీక్వెల్ ఉండొచ్చు

చదువు పూర్తి చేసి స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు ‘బంగార్రాజు’. చిన్నప్పుడే మామ కూతురు నాగలక్ష్మీ (కృతి శెట్టి) తో ‘బంగార్రాజు’ పెళ్లి చెయ్యాలని నానమ్మ నిర్ణయించుకుంటుంది. అయితే ‘బంగార్రాజు’, నాగలక్ష్మీలకు ఒక్క క్షణం కూడా పడదు. తాను తెలివిగలదాన్ననుకునే నాగలక్ష్మీ శివపురానికి సర్పంచ్ అవుతుంది.
భూలోకానికి ఆత్మగా వచ్చిన ‘బంగార్రాజు’ (నాగార్జున), మనవడిలోకి ప్రవేశించి అతణ్ణి కాపాడుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ‘బంగార్రాజు’, నాగలక్ష్మీల మధ్య విబేధాలు తలెత్తుతాయి. ఇంతకీ వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందా?.. యముడు, ‘బంగార్రాజు’ ని ఎందుకు భూమ్మీదకు పంపాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లిన సత్యభామ (రమ్యకృష్ణ) తిరిగి భూమ్మీదకి ఎందుకువచ్చింది?.. బంగార్రాజు, సత్యభామ కలిసి మనవడికి పెళ్లి జరిపించారా? బంగార్రాజు కొడుకు రాము తిరిగి వచ్చాడా, లేదా?.. అసలు బంగార్రాజుని ఎవరు, ఎందుకు చంపాలనుకున్నారు? అనేది మిగతా కథ..

Anup Rubens : ‘బంగార్రాజు’ సినిమా కోసం రోజుకి 20 గంటలు పని చేశాం

నటీనటులు..
కింగ్ నాగార్జున నటన గురించి కొత్తగా చెప్పేదేముంది.. ఎప్పటిలానే ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌లో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆత్మగా మారినప్పుడు నాగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక నాగ చైతన్య కూడా ‘బంగార్రాజు’ రోల్‌కి పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు. మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపిస్తాయి.
సత్యభామగా రమ్యకృష్ణ తన నటనతో ఆకట్టుకున్నారు. విలేజ్ యువతిగా, యంగ్ సర్పంచ్‌గా నటనతో పాటు క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా బాగా చేసింది. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ వంటి మిగతా నటీనలంతా తమ పాత్రల పరిధిమేర మంచి నటన కనబర్చారు.

టెక్నీషియన్స్..
దర్శకుడు కళ్యాణ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్ పాయింట్ రాసుకున్నాడు. దానికి సీనియర్ రైటర్ సత్యానంద్ స్క్రీన్‌ప్లే తోడైంది. ప్రీక్వెల్ అంతా మనవడి వెర్షన్‌లో వెళ్లినా పెద్ద ‘బంగార్రాజు’, అతని భార్య సత్యభామ ఇద్దరూ మనవడికి అండగా నిలబడి సమస్యలను ఎలా పరిష్కరించారనేది వివరంగా చూపిండంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కథ, మాటలు, దర్శకత్వ ప్రతిభ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. కెమెరామెన్ జె.యువరాజ్ విజువల్స్ సినిమాకు అందాన్ని తీసుకొచ్చాయి. అనూప్ రూబెన్స్ నేపథ్యసంగీతం ఆకట్టుకుంటుంది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి సెట్స్ కూడా ఎసెట్ అయ్యాయి.

ఓవరాల్‌గా..

ముందునుండి నాగ్ చెప్తున్నట్లు ‘బంగార్రాజు’ పండగ లాంటి సినిమా.. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా..