Mahesh Babu : తండ్రిని త‌లుచుకుంటూ మ‌హేశ్ బాబు ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. ‘నా ప్ర‌తి జ్ఞాప‌కంలో నువ్వుంటావు నాన్న‌..’

తెలుగు సినిమాకు కొత్త హంగులు అద్దడంలో సూప‌ర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాలు మరో టాలీవుడ్‌ హీరో ఎవరు చేయలేర‌ని అంటుంటారు సినీ విశ్లేష‌కులు.

Super star Mahesh babu emotional post on father krishna birth anniversary

Mahesh Babu – krishna : తెలుగు సినిమాకు కొత్త హంగులు అద్దడంలో సూప‌ర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాలు మరో టాలీవుడ్‌ హీరో ఎవరు చేయలేర‌ని అంటుంటారు సినీ విశ్లేష‌కులు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గానే కాకుండా తెలుగు సినిమాకు స‌రికొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేసిన ఘ‌నుడు ఆయ‌న‌. నేడు ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రిటీలు, అభిమానులు న‌ట‌శేఖ‌రుడిని జ్ఞ‌ప్తికి తెచ్చుకుంటూ ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.

కృష్ణ కుమారుడు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తండ్రి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న.. మిమ్మ‌ల్ని ఎంత‌గానో మిస్స‌వుతున్నాము. నా ప్ర‌తి జ్ఞాప‌కంలో నువ్వు ఎప్ప‌టికీ జీవించే ఉంటావు.’ అని మ‌హేశ్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం మ‌హేశ్ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Music Shop Murthy Trailer : అజ‌య్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైల‌ర్‌.. కాలంతో పాటు మ‌నం మారాలి

1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం అనే గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. సినిమాపై ఇష్టంతో చదువు పూర్తయ్యాక కృష్ణ చెన్నైకి వెళ్లారు. హీరోగా కృష్ణ చేసిన మొదటి చిత్రం తేనెమనసులు 1965లో రిలీజ్ అయ్యింది.

ఐదు ద‌శాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కృష్ణ 350కి పైగా సినిమాల్లో న‌టించారు. ఓ ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత సూపర్ స్టార్‌దే. 1972లో కృష్ణ ఏకంగా 18 సినిమాల్లో నటించారు. అంతకమందు 1971లో 11, 1970లో కృష్ణ హీరోగా నటించిన 16 సినిమాలు విడుద‌ల అయ్యాయి. 2022 న‌వంబ‌ర్ 15న ఆయ‌న హార్ట్ ఎటాక్‌తో క‌న్నుమూశారు.

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వ‌క్‌లోని మాస్ యాంగిల్‌ను మ‌రో కోణంలో..!