Music Shop Murthy Trailer : అజ‌య్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైల‌ర్‌.. కాలంతో పాటు మ‌నం మారాలి

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అజ‌య్ ఘోష్.

Music Shop Murthy Trailer : అజ‌య్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైల‌ర్‌.. కాలంతో పాటు మ‌నం మారాలి

Ajay Ghosh Music Shop Murthy Trailer

Updated On : May 31, 2024 / 9:47 AM IST

Music Shop Murthy : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అజ‌య్ ఘోష్. ఆయ‌న‌ మెయిన్ లీడ్ లో న‌టించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి ముఖ్య పాత్రలో న‌టిస్తోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆమని, అమిత్ శర్మ, భానుచందర్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి ప‌వ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ చిత్రం జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ చిత్ర పోస్ట‌ర్లు, టీజ‌ర్లు సినిమాపై ఆస‌క్తిని క‌లిగించ‌గా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఏంటీ ఇంకా డీజే రాలేదు అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ఆరంభ‌మైంది.

Aa Okkati Adakku : సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన అల్లరోడి సినిమా..

ట్రైల‌ర్‌ను చూస్తుంటే.. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న 50 ఏళ్ల‌ మిడిల్ క్లాస్ వ్య‌క్తి డీజే అవ్వాలని హైదరాబాద్ కి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఈ ప్రయాణంలో 25 ఏళ్ళ అమ్మాయి చాంద‌నీ చౌద‌రి ఎలా ప‌రిచ‌మైంది. ఆమె అత‌డికి ఎలా సపోర్ట్ చేసింది. ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుటున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. మొత్తంగా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.