Mahesh Babu : సీఎంతో మహేష్ బాబు భేటీ.. బాబు లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్..

తాజాగా మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Super Star Mahesh Babu Meets Telangana CM Revanth Reddy Photos Goes Viral

Mahesh Babu – CM Revanth Reddy : ఇటీవల ఏపీ, తెలంగాణలో ఏర్పడిన వరదలకు మన సినీ సెలబ్రిటీలు వరద బాధితుల కోసం భారీ విరాళాలు సాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు చెరో 50 లక్షలు ప్రకటించారు. తాజాగా మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Also Read : Sai Pallavi : ఇటీవలే చెల్లి పెళ్లి.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీపై సాయి పల్లవి కామెంట్స్.. ఇంట్లో వాళ్లకు చెప్పేసాను..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ బాబు వరద బాధితుల సాయం కోసం 50 లక్షల రూపాయల చెక్కుని అందించారు. అలాగే AMB సినిమాస్ తరపున మరో 10 లక్షలు కూడా అందచేశారు. సీఎం రేవంత్ మహేష్ కి ధన్యవాదాలు తెలిపి శాలువా వేసి సత్కరించారు. అయితే మహేష్ రాజమౌళి సినిమా కోసం సరికొత్త లుక్ లోకి మారుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు సీఎం రేవంత్ భేటీలో మహేష్ ఫుల్ గా గడ్డం, జుట్టు పెంచుకొని సరికొత్త లుక్ లో కనిపించడంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ఫోటోలను చూసి బాబు లుక్ అదిరిందిగా, రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో , ఇండియానా జోన్స్ లాగే లుక్ తయారుచేస్తున్నట్టు ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.