Coolie Twitter Review : కూలీ ట్విట్ట‌ర్ రివ్యూ.. విల‌న్‌గా నాగార్జున మెప్పించాడా?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన చిత్రం కూలీ (Coolie Twitter Review). ప్ర‌పంచ వ్యాప్తంగా నేడు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు

Super star Rajinikanth Coolie Movie Twitter Review

Coolie Twitter Review : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) న‌టించిన చిత్రం కూలీ. లోకేష్‌ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తొలిసారి నెగిటివ్ రోల్‌లో న‌టించాడు. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, శృతిహాసన్, సత్యరాజ్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేడు (ఆగ‌స్టు 14 గురువారం) ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే ప‌లు చోట్ల ఫ‌స్ట్ షోలు ప‌డ్డాయి. ఈ చిత్రం చూసిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను (Coolie Twitter Review ) తెలియ‌జేస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉంది? విల‌న్‌గా నాగార్జున అద‌ర‌గొట్టాడా? ర‌జినీకాంత్ ఖాతాలో హిట్ ప‌డిందా? వంటి విష‌యాల పై ఏమ‌ని కామెంట్లు చేశారో ఓ సారి చూద్దాం..

War 2 Twitter Review : ‘వార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ కుమ్మేశాడ‌ట‌..

విల‌న్ రోల్‌లో నాగార్జున అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. అమిర్ ఖాన్ గెస్ట్ రోల్ బాగుంద‌ని చెబుతున్నారు. అనిరుద్ బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని అంటున్నారు. ర‌జినీకాంత్ న‌ట‌న అదిరిపోయింద‌ని, ఆయ‌న్ను స‌రికొత్త‌గా చూపించార‌ని కామెంట్లు చేస్తున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు బాగున్నాయ‌ని చెబుతున్నారు.