Rajinikanth : వాట్.. రజినీకాంత్ సినిమా ఓటీటీకి అన్ని కోట్లకు అమ్ముడయిందా?

రజనీకాంత్ కే క్రేజ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది.

Super Star Rajinikanth Movie OTT Sale for huge Amount

Rajinikanth : రజనీకాంత్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పక్కర్లేదు భారీ ఫైట్స్ చెయ్యక్కర్లేదు. జస్ట్ అలా నడిచొస్తే చాలు. స్టైల్ గా ఓ లుక్కేస్తే చాలు. సినిమా హిట్టే. అలా జైలర్ తో మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రజనీకాంత్ తన అప్ కమింగ్ సినిమాల్ని సాలిడ్ లైనప్ చేసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. క్రేజ్ తోపాటు రేట్ కూడా పెరిగిపోతోంది. రజనీ సినిమా అంటే చాలు రైట్స్ కోసం కళ్లు మూసుకుని కోట్లు కుమ్మరించేస్తున్నారు. కలెక్షన్ల సంగతి పక్కనపెడితే రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ కోసం వందలకోట్లు ఆఫర్ చేస్తున్నారు.

వీటిల్లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయిన లోకేశ్ కనగరాజ్ తో చేస్తున్న కూలీ మీదే అందరూ కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ మీదున్న హైప్ కి తోడు లేటెస్ట్ గా 120కోట్లకి ఓటీటీ రైట్స్ సేల్ అయ్యాయనే వార్తతో కూలీ హైప్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయింది.

Also Read : Sreeleela : రష్మిక సెంటిమెంట్ శ్రీలీలకు.. ఈ సినిమా తర్వాత శ్రీలీల కూడా బిజీ స్టార్ హీరోయిన్..

రజనీకాంత్ కే క్రేజ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. అలాంటిది ఈ పవర్ హౌజ్ కి లోకేశ్ కనగరాజ్ లాంటి సాలిడ్ డైరెక్టర్ యాడ్ అయితే ఆ స్టైలిష్ యాక్షన్ ని చూడడానికి కళ్లు సరిపోవు. వీటికి తోడు సినిమాలో నాగార్జున,ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లాంటి క్రేజీ యాక్టర్స్ అప్పియరెన్స్ ఉండడంతో కూలీ మీద ఫస్ట్ నుంచి అంచనాలున్నాయి జనాల్లో. స్టార్టింగ్ రిలీజ్ చేసిన వీడియో నుంచే మంచి వైబ్ రిసీవ్ చేసుకున్న కూలీ అప్పటి నుంచి జనాల్లో అంచనాలు పెంచేస్తూనే ఉంది.

Also See : Shobha Shetty : బిగ్ బాస్ భామ శోభాశెట్టి హోలీ సెలబ్రేషన్స్ ఫొటోలు..

ఇప్పుడు ఏకంగా 120 కోట్లకి ఓటీటీ సేల్ అయిందని తెలియడంతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ చర్చించుకుంటున్నారు. కూలీ హైప్ విపరీతంగా పెరగడానికి మరో రీజన్ కూలీలో రజనీ క్యారెక్టర్. ఇప్పటి వరకూ చేసిన క్యారెక్టర్లకి కంప్లీట్ డిఫరెంట్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు రజనీ. వీటికి తోడు లోకేశ్ కనగరాజ్ సినిమాల్లో యాక్షన్ కి స్పెషల్ ఫాన్ బేస్ ఉంటుంది. వీటికి రజనీ స్టైల్ యాడ్ అయ్యితే ఇక ఆ ఫైట్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయని ఊహిస్తున్నారు ఆడియన్స్. అందుకే కూలీ ఎప్పుడెప్పుడు థియేటర్లోకొస్తుందా అని వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు రజనీ అభిమానులు.