Sreeleela : రష్మిక సెంటిమెంట్ శ్రీలీలకు.. ఈ సినిమా తర్వాత శ్రీలీల కూడా బిజీ స్టార్ హీరోయిన్..
ఏ హీరో పక్కన చూసినా శ్రీలీలే. ఏ సినిమాలో చూసినా శ్రీలీలే. ఇదంతా 2023 వరకు.

Sreeleela Will Become Star Heroine after Robinhood Movie with this Sentiment
Sreeleela : శ్రీలీల దశ తిరగబోతోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా సంవత్సరానికి 4 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చినా రాని సక్సెస్ రాబిన్ హుడ్ తో రాబోతోంది. ఏ హీరో పక్కన చూసినా శ్రీలీలే. ఏ సినిమాలో చూసినా శ్రీలీలే. ఇదంతా 2023 వరకు. వాటిల్లో వరసగా ఫ్లాపులు రావడం, డాక్టర్ ఎగ్జామ్స్ అని తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో సడెన్ గా ఫేడవుట్ అయిపోయింది శ్రీలీల.
మొన్న పుష్ప 2 లో ఐటెం సాంగ్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినట్టే అన్నారు. ఇక శ్రీలీల కష్టాలన్నీ రాబిన్ హుడ్ తో తీరబోతున్నాయి. రష్మిక లా రయ్ మని పాన్ ఇండియా మొత్తం దూసుకుపోబోతోంది శ్రీలీల. రష్మిక లా శ్రీలీల సక్సెస్ లు కొట్టడం ఖాయమంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే వెంకీ కుడుముల ఫస్ట్ మూవీ చలో, తర్వాత చేసిన భీష్మ ఇలా రెండు సినిమాల్లో రష్మికే హీరోయిన్. ఛలో చేసిన తర్వాత రష్మిక కెరీర్ కంప్లీట్ గా మారిపోయింది.
చలో తర్వాత రష్మికకు వరసగా తెలుగులో అవకాశాలు, బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో జెట్ స్పీడ్ గా కంటిన్యూ అవుతోంది. ఇక నితిన్ భీష్మలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకుని రష్మిక కెరీర్ కి మరింత బూస్టప్ ఇచ్చారు వెంకీ. ఆ సినిమా తర్వాత రష్మిక పాన్ ఇండియా స్టార్ అయిపోయి నేషనల్ క్రష్ గా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా బిజీ అయింది.
దాంతో రాబిన్ హుడ్ సినిమాతో శ్రీలీల కూడా రష్మిక లానే మారిపోతుందని, దెబ్బకి దశ తిరుగుతందని టాక్ నడుస్తోంది. శ్రీలీల రెండేళ్ల క్రితం వరకూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మహేశ్ బాబు, బాలకృష్ణ, లాంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ సినిమాలు హిట్ అయినా శ్రీలీలకి పెద్దగా క్రెడిట్ రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసిన ఉస్తాద్ ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది.
ఇలా స్టార్ హీరోల సినిమాలకు పెద్దగా క్రేజ్ రాకపోవడం, ఆల్రెడీ చేసిన సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో కెరీర్ కాస్త డల్ గానే ఉంది శ్రీలీలకి. సరిగ్గా అలాంటి టైమ్ లోనే రాబిన్ హుడ్ లో పవర్ ఫుల్ రోల్ తో రాబోతోంది శ్రీలీల. ఆల్రెడీ వెంకీ కుడుముల లక్ ఫ్యాక్టర్ ఉండనే ఉంది కాబట్టి శ్రీలీల కెరీర్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లే చాన్సుందంటున్నారు ఆడియన్స్. ఈ సినిమా తర్వాతే శ్రీలీలకు తెలుగులో రెండు సినిమాలు, తమిళ్ లో ఒక సినిమా, బాలీవుడ్ లో ఒక సినిమా ఉన్నాయి. దీంతో రాబిన్ హుద్ తో మొదలుపెట్టి శ్రీలీల హవా మళ్ళీ సాగుతుందని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఇక రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది.