Rajinikanth : సూపర్ స్టార్ బర్త్‌డే.. 73 ఏళ్ళ వయసులో కూడా అభిమానుల కోసం కష్టపడుతున్న రజినీకాంత్..

రజినీకాంత్ పని అయిపొయింది అన్న ప్రతి సారి ఓ సాలిడ్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తారు రజిని.

Super Star Thalaivar Rajinikanth Birthday Special Story

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు వింటే తమిళ్ మాత్రమే కాదు సౌత్, ఇండియా అంతా ఊగిపోతోంది. రజినీకాంత్ స్టైల్ ని మెచ్చుకోని వారుండరు. రజిని సింప్లిసిటీకి ఫిదా అవ్వని వారుండరు. బస్ కండెక్టర్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి హీరోగా సక్సెస్ అయి స్టార్ హీరోగా ఎదిగిన శివాజీ రావు గైక్వాడ్ మనందరికీ ఇష్టమైన సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారారు.

ఇప్పుడున్న జనరేషన్ లో 40 ఏళ్లకే ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది. 50 ఏళ్లకే పనులు చేయాలంటే కష్టపడుతున్నారు. కానీ 73 ఏళ్ళ వయసులో రజినీకాంత్ ఇప్పటికి కూడా అభిమానుల కోసం సినిమాలు చేస్తూ సినిమాల్లో యాక్షన్ సీన్స్ కోసం కష్టపడుతున్నారంటే అది ఆయనకు సినిమా మీద ఉన్న పిచ్చి, అభిమానుల మీద ఉన్న ప్రేమ మాత్రమే.

రజినీకాంత్ పని అయిపొయింది అన్న ప్రతి సారి ఓ సాలిడ్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తారు రజిని. రోబో తర్వాత వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రోబో 2 తర్వాత మళ్ళీ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆయనకు ఉన్న అభిమానులు తగ్గలేదు. కానీ రజినీకి ఏజ్ అయిపొయింది, సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, రెస్ట్ తీసుకోవడం బెటర్ అని వార్తలు వచ్చాయి. ఇటీవల జైలర్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసి తమిళ్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది జైలర్. 70 ఏళ్ళు దాటినా సినిమాల్లో ఇంకా అదే పవర్ చూపిస్తూ, తన స్టైల్ ని అలాగే మెయింటైన్ చేస్తూ అభిమానులని, ప్రేక్షకులని మెప్పిస్తున్నారు.

ఇప్పటికి ఆయనకు రెస్ట్ తీసుకోమని, సినిమాలు ఆపేయమని చాలామంది సలహాలు ఇస్తుంటారు. కానీ ప్రస్తుతం రజినీకాంత్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. రజిని గెస్ట్ గా చేసిన లాల్ సలాం సినిమా సంక్రాంతికి రాబోతుంది. ఆ తర్వాత తలైవర్ 170వ సినిమా, తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 171వ సినిమా ఉన్నాయి. ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తారు రజిని. ఆయనకు ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు, లేకపోయినా తెచ్చుకొని మరీ సినిమాలు చేస్తారు.

Also Read : Bigg Boss 7 Day 99 : చివరి వారం.. ఎమోషనల్ జర్నీలే.. అమర్, అర్జున్ బిగ్‌బాస్ జర్నీ..

ఒక బస్ కండక్టర్ గా ఉండిపోయే శివాజీ రావు గైక్వాడ్ ని సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ ని చేసి లైఫ్ లో డబ్బు, పవర్, పేరు, బిరుదులు, అవార్డులు అన్ని ఇచ్చింది. కేవలం ఇండియాలోనే కాదు మలేషియా, సింగపూర్, జపాన్.. లాంటి చాలా దేశాల్లో అభిమానులు ఎంతో ప్రేమని ఇచ్చారు. అందుకే రజినీకాంత్ కి సినిమాలు తీయడానికి వయసు అయిపోలేదు, అయిపోదు. ఇక అంత స్టార్ డమ్ ఉన్నా ఎంతో సింప్లిసిటీగా బతికేస్తు, సాధారణ భక్తుడిలా గుళ్ళు, గోపురాలు తిరిగేస్తూ, నేను అందరిలాంటి వాడినే అని తనకున్న బట్టతలని కవర్ చేయకుండా, అభిమానులని పలకరిస్తూ, సినీ పరిశ్రమలో ట్యాలెంట్ ఉన్నవారిని ఇంటికి పిలిచి అభినందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు తలైవర్.