సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో రెండు వరుస హిట్స్ సొంతం చేసుకున్న మహేష్ తాజాగా ఓ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు దాటింది. దీంతో సౌత్ ఇండియాలో 9 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేసాడు.
సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ( 9 మిలియన్లు) కలిగిన ఏకైక నటుడు మహేషే.
2010 ఏప్రిల్‌లో ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన మహేష్ బాబు, అప్పటినుండి ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ విషయాలకు సంబంధించిన అప్ డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటున్నాడు. రీసెంట్‌గా మహేష్ ఈ రికార్డు సొతం చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు..