మహేష్ ‘‘1010 గుండెల చప్పుడు’’.. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం..

‘‘ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’’.. ఈ డైలాగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమాలోనిది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఈ డైలాగ్ ఇప్పుడు మహేష్ బాబుకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఆయన హృదయం అంత గొప్పది. ఇప్పటి వరకు మహేష్ బాబు 1010 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి తనలో నిజంగానే దేవుడున్నాడని చాటిచెప్పారు.‘Heal A Child Foundation’ ద్వారా మహేష్ బాబు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు మహేష్ భారీగా విరాళాలు ఇస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల గుండెకు సంబంధించిన సర్జరీలకు ఎంత ఖర్చయినా నేనే పెట్టుకుంటానని ఆ మధ్య మహేష్ బాబు కూడా తెలిపారు.
తాజాగా ఓ చిన్నారి హార్ట్ ఆపరేషన్ నిమిత్తం సోషల్ మీడియా ద్వారా మహేష్‌కు అభ్యర్థనలు వస్తుండటంతో వెంటనే స్పందించిన ‘హీల్ ఏ ఛైల్డ్ ఫౌండేషన్’ సంస్థ.. ఆ చిన్నారి ఆపరేషన్‌కి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పటి వరకు మొత్తంగా 1010 ఆపరేషన్లకు మహేష్ బాబు సహకారం అందించినట్లుగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు కూడా సోషల్ మీడియా ద్వారా మహేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.