Mahesh Babu : మహేశ్ బాబు కొత్త యాడ్ చూశారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పలు వాణిజ్య కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Superstar Mahesh Babu in TruZon Solar new ad
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పలు వాణిజ్య కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త బ్రాండ్ అయిన ట్రూజన్ సోలార్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. తాజాగా ట్రూజన్ సోలార్ మొదటి యాడ్ వచ్చేసింది. ఇళ్లైనా, కార్యాలయాలు అయినా ట్రూజన్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తే కరెంట్ బిల్లు మోత తప్పుతుందని మహేశ్ ఇందులో చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఈ ట్రూజన్ సోలార్‌లో మహేశ్‌బాబు భారీగా పెట్టుబడులు పెట్టినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఏఎంబీ సినిమాస్, హంబుల్ డ్రెసెస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లలో మహేశ్ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ చిత్రంలో నటించనున్నారు. అమెజాన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీ కోసం మహేశ్ సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. లాంగ్ హెయర్, గడ్డంతో సూపర్‌గా తయారు అయ్యారు.
త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి సినిమా లొకేషన్ల వేటలో ఉన్నాడు. ఈ మూవీలో అంతర్జాతీయ స్థాయి నటీనటీలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Jabardasth Ram Prasad : జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ కి యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..