×
Ad

Mahesh Babu : మహేష్ బాబుకి కరోనా నెగెటివ్

తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో మహేష్ బాబుకి నెగెటివ్ వచ్చింది..

  • Published On : January 14, 2022 / 06:29 PM IST

Mb

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఇటీవల కోవిడ్ బారినపడ్డ మహేష్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని సన్నిహితులు వెల్లడించారు.

Mahesh Babu : మహేష్ @1057 గుండెల చప్పుడు..

కొద్దిరోజుల క్రితం స్వల్ప లక్షణాలు బయటపడడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వైద్యుల పర్యవేక్షణలో, వారి సలహాలు, సూచనలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉన్నారు మహేష్.

Mahesh Babu : మహేష్ మేనల్లుడు ‘హీరో’ మహేష్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా

మహేష్ క్వారంటైన్‌‌లో ఉండగానే సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుత పరిస్థుతుల నేపథ్యంలో అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు మహేష్. కాగా మహేష్ సోదరి పద్మ, గల్లా జయదేవ్‌ల తనయుడు గల్లా అశోక్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘హీరో’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ అవుతోంది.

Bangarraju : రివ్యూ..

ఈ సందర్భంగా మేనల్లుడికి, చిత్రబృందానికి విషెస్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు మహేష్. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో ‘సర్కారు వారి పాట’ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చెయ్యనున్నారు మహేష్ బాబు.