Rajinikanth : రజనీకాంత్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో ఆందోళన

తమిళ్ సూపర్‌స్టార్, తలైవా రజనీకాంత్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లారు.

Rajinikanth : రజనీకాంత్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో ఆందోళన

Superstar Rajinikanth Went America For Medical Checkup

Updated On : June 15, 2021 / 11:28 AM IST

Rajinikanth : తమిళ్ సూపర్‌స్టార్, తలైవా రజనీకాంత్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో విమానా రాకపోకలపై పలుదేశాలు ఆంక్షలు విధించాయి.

అయితే రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పించుకుని సోమవారం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ విమానంలో 14 మంది వరకు ప్రయాణించవచ్చుట. ఆయన హెల్త్ చెకప్ కోసమే అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

గతేడాది అన్నాత్తె షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలో అధిక రక్తపోటుకు గురైన రజనీకాంత్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. కాగా రజనీ అల్లుడు ధనుష్ హాలీవుడ్ చిత్రం”దిగ్రేట్ మ్యాన్” షూటింగ్ నిమిత్తం కుటుంబం సమేతంగా అమెరికాలోనే ఉన్నారు.

తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ ప్రారంభించాలనుకుని కూడా  అనారోగ్య కారణాల దృష్ట్యా  తన రాజకీయ ఆరంగేట్రం ఆలోచనను రజనీకాంత్ విరమించుకున్నారు.