‘‘లయన్ ఇన్ లంబోర్ఘిని’’.. సూపర్‌స్టార్ స్టైల్ చూశారా!

ఎప్పుడూ అత్యంత సింపుల్‌గా కనిపించే సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజాగా ఓ ఖరీదైన కారులో చక్కర్లు కొట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన లంబోర్గినిని రజినీకాంత్ స్వయంగా నడుపుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెల్ల కుర్తా, పైజామా, మొహానికి మాస్క్ వేసుకుని రజినీ ఈ కారును డ్రైవ్ చేశారు. ఈ ఫోటోను రజినీ అభిమానులు ట్విట్టర్‌లో వైరల్ చేస్తున్నారు. ‘లయిన్ ఇన్ లంబోర్గినీ’ #LionInLamborghini అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. తన కూతురు సౌందర్య, ఆమె భర్త, మనవడితో కలిసి కారు ముందు నిల్చుని రజినీ దిగిన పిక్ కూడా బాగా వైరల్ అవుతోంది. రజినీ ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.