జనవరి 9న సూపర్‌స్టార్ ‘దర్బార్’

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్..‘దర్బార్’ 2020 జనవరి 9న విడుదల..

  • Publish Date - November 19, 2019 / 05:27 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్..‘దర్బార్’ 2020 జనవరి 9న విడుదల..

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్..‘దర్బార్’.. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, నివేదా ధామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు  శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవల విడుదల చేసిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రజనీ ‘ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు.. రజినీ ప్రస్తుతం తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. 2020 సంక్రాంతికి సినిమా విడుదల అన్నారు కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు..

Read Also : నిర్మాత లక్ష్మణ్ కుమారుడు ఉజ్వల్ నిశ్చితార్థ వేడుకలో హీరోల హంగామా..

రీసెంట్‌గా ‘దర్బార్’ రిలీజ్ డేట్ ప్రకటంచారు. 2020 జనవరి 9న సినిమాను భారీగా విడుదల చేయనున్నారు. ‘పేట’ ఈ ఏడాది జనవరి 10న విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఒక రోజు ముందుగానే రాబోతున్నాడు రజినీ. ‘దర్బార్’.. తమిళ్, తెలుగుతో పాటు, హిందీ, మలయాళ భాషల్లోనూ రిలీజవనుంది. సంగీతం : అనిరుధ్, కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్.