Amaravathiki Aahwanam : సుప్రీత ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’.. హారర్ మూవీ మూడు రాష్ట్రాల్లో షూటింగ్..

హార‌ర్ థ్రిల్ల‌ర్ గా 'అమ‌రావ‌తికి ఆహ్వానం' అనే ఆసక్తికర టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Supritha Dhanya Balakrishna Ester Noranha Amaravathiki Aahwanam Movie

Amaravathiki Aahwanam : ఇటీవల హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ గా ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’ అనే ఆసక్తికర టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. శివ కంఠంనేని, సురేఖావాణి కూతురు సుప్రీత, ఎస్త‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌ పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. హ‌రీష్, అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు నిర్మాణంలో జివికె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ మూడు రాష్ట్రాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. మ‌ధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్‌, పాతాళ్ కోట్‌, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి ప‌లు లొకేష‌న్స్‌లో దాదాపు 20 రోజుల పాటు హారర్ సీన్స్ షూట్ చేసారని సమాచారం.

Also Read : Vijay Deverakonda : ఆ మ్యాగజైన్ కోసం విజయ్ దేవరకొండ స్టైలిష్ పోజులు.. కింగ్డమ్ లుక్ లో అదరగొట్టాడుగా..

ఈ సందర్భంగా నటుడు శివ కంఠంనేని మాట్లాడుతూ.. అమ‌రావ‌తికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డైరెక్టర్ జీవీకే ఒక మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు అని అన్నారు. డైరెక్టర్ జివికె మాట్లాడుతూ.. స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాశంతో అమ‌రావ‌తికి ఆహ్వానం సినిమా వస్తుంది. ఈ సినిమాలో VFX వర్క్ చాలా ఉంది అని తెలిపారు. నిర్మాత‌లు మాట్లాడుతూ.. మ‌ధ్య ప్ర‌దేశ్ షూటింగ్స్ లో సహకరించిన అక్కడి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Anchor Ravi – Ramaya Krishnan : టీవీ ప్రోగ్రాంలో రమ్యకృష్ణతో సరదాగా యాంకర్ రవి.. ఫొటోలు..