Ram Charan : కొడుకు బర్త్‌డే సందర్భంగా.. 500 మందికి అన్నదానం చేసిన రామ్‌చరణ్ తల్లి..

కొడుకు బర్త్‌డే సందర్భంగా 500 మందికి అన్నదానం చేసిన రామ్‌చరణ్ తల్లి. గత కొన్నిరోజులుగా అపోలో హాస్పిటల్స్‌లో..

surekha konidela celebrating his son Ram Charan birthday in grandly

Ram Charan : రేపు మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. దీంతో టాలీవుడ్ లో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జోరు కనిపిస్తుంది. ఒక పక్క ఫ్యాన్స్ సందడి, మరో పక్క కొత్త సినిమా అప్డేట్స్, మెగా ఫ్యామిలీ స్పెషల్ ఈవెంట్స్.. ఇలా ఓ నాలుగు రోజుల నుంచి చరణ్ పుట్టినరోజు వేడుకలు కనిపిస్తూ వస్తున్నాయి. ఈక్రమంలోనే రామ్ చరణ్ తల్లి సురేఖ.. అన్నదానం చేసి కొడుకు బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.

గత కొన్నిరోజులుగా అపోలో హాస్పిటల్స్ లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్న ఈ కార్యక్రమంలో సురేఖతో పాటు ఉపాసన కుటుంబసభ్యులు, అపోలో వర్కర్స్, పలువురు భక్తులు కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే సురేఖ కొణిదెల తన కొడుకు బర్త్ డేని కూడా నిర్వహించారు. పూజలో పాల్గొన్న 500 భక్తులకు రామ్ చరణ్ పేరిట.. సురేఖ అన్నదానం చేసారు.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా మూవీ కాదా..? కేవలం ఆ భాషల్లోనే రిలీజ్..

‘అత్తమ్మస్ కిచెన్’ ద్వారా ఈ అన్నదానాన్ని నిర్వహించారు. ఉపాసన సహాయంతో సురేఖ ఇటీవలే.. ఈ అత్తమ్మస్ కిచెన్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు. ఈ అన్నదానంతో చరణ్ బర్త్ డేని మాత్రమే కాదు, తమ బిజినెస్ ప్రమోషన్స్ ని కూడా నిర్వహించేసారు. ఇక ఈ అన్నదానానికి సంబంధించిన వీడియోని అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ తన బర్త్ డేని తిరుపతిలో జరుపుకోవడానికి బయలుదేరారు. ఉపాసన, క్లీంకారతో కలిసి ఈరోజు సాయంత్రం రామ్ చరణ్ తిరుపతి బయలుదేరారు. రేపు శ్రీవారి అశీసులు తీసుకోని తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మరో పక్క ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్ స్పెషల్ ఈవెంట్ కూడా ఉంది. మరి ఆ ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా రాబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది.