‘సైరా’ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు..
మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ సినిమా చేసిన సైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ‘సైరా’ వంటి హిస్టారికల్ చిత్రాన్ని సూరి చాలా బాగా హ్యాండిల్ చేశాడని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించిన సంగతి తెలిసిందే..
‘సైరా’ తర్వాత సురేందర్ రెడ్డి కొత్త సినిమాను ఏ హీరో, నిర్మాతతో చేస్తాడు అని టాలీవుడ్‌లో చర్చ జరుగుతుండగా.. సూరి కొత్త సినిమా గురించి ఫిలింనగర్‌లో ఓ వార్త వినిపిస్తోంది. దిల్ రాజు, సురేందర్ రెడ్డితో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట..
Read Also : త్రీ ఖాన్స్ ఇన్ వన్ ఫ్రేమ్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్ ఇద్దరిని హీరోలుగా అనుకుంటున్నారని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం కథపై వర్క్ చేస్తున్నాడట.. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.