suresh babu and allu aravind comments on Samantha
Unstoppable : ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది.
Raghavendra Rao : బాహుబలి రెండు పార్టులుగా తీయమని చెప్పింది నేనే.. ఖర్చు చూసి భయపడ్డాం..
ఈ ఎపిసోడ్ లో సినిమాల గురించి అనేక విషయాలు మాట్లాడారు. అలాగే పలు ప్రశ్నలు అడిగారు బాలయ్య. ఇప్పటి హీరో, హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పటి హీరోయిన్స్ లో మహానటి లాంటి పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వగలరు అని బాలయ్య అడిగాడు. దీనికి సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇద్దరూ ఒకేసారి సమంత పేరు చెప్పారు. ఈ జనరేషన్ లో సమంత మహానటి అందులో సందేహమే లేదు అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సమంత ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.