Raghavendra Rao : బాహుబలి రెండు పార్టులుగా తీయమని చెప్పింది నేనే.. ఖర్చు చూసి భయపడ్డాం..

బాహుబలి సినిమాకి రాఘవేంద్రరావు కూడా ఒక నిర్మాత కావడంతో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. బాహుబలి కథ వినమంటే రాజమౌళి కదా అక్కర్లేదు అన్నాను. షూట్ మొదలయ్యాక...............

Raghavendra Rao : బాహుబలి రెండు పార్టులుగా తీయమని చెప్పింది నేనే.. ఖర్చు చూసి భయపడ్డాం..

Raghavendra Rao comments on Bahubali movie

Raghavendra Rao :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో అనేక సినిమాల గురించి, సినిమా విషయాల గురించి మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల ఫోటోలు చూపించి వాటి గురించి చెప్పామన్నారు బాలయ్య బాబు. ఇందులో భాగంగా మాయాబజార్, శంకరాభరణం, ఆదిత్య 369, బాహుబలి, శివ, అల్లూరి సీతారామరాజు సినిమాల ఫోటోలు చూపించారు. వీటిపై అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్ర రావు తమ అభిప్రాయాలని తెలిపారు.

RGV : బాలకృష్ణ షోలో ఆర్జీవీని పొగిడిన సురేష్ బాబు..

బాహుబలి సినిమాకి రాఘవేంద్రరావు కూడా ఒక నిర్మాత కావడంతో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. బాహుబలి కథ వినమంటే రాజమౌళి కదా అక్కర్లేదు అన్నాను. షూట్ మొదలయ్యాక లెంగ్త్ చాలా ఎక్కువ వస్తుంది, ఒకసారి కథ వినండి అని రాజమౌళి అడగడంతో విన్నాను. మూడు గంటల పాటు షాట్స్ తో సహా కథని చెప్పాడు. ఎక్కడా కట్ చేయాలి అనిపించలేదు. దీంతో సినిమాని రెండు పార్టులు తీయమని చెప్పాను. కానీ బడ్జెట్ పెరిగిపోయింది. పెట్టిన బడ్జెట్ వస్తుందా రాదా అని చాలా భయపడ్డాం సినిమా రిలీజ్ అయ్యేవరకు అని చెప్పారు.