Abhimani : ‘అభిమాని’ గ్లింప్స్ రిలీజ్.. యముడిగా అజయ్ ఘోష్..

తాజాగా అభిమాని సినిమా గ్లింప్స్ రిలీజ్ రిలీజ్ చేసారు.

Abhimani : ‘అభిమాని’ గ్లింప్స్ రిలీజ్.. యముడిగా అజయ్ ఘోష్..

Suresh Kondeti Ajay Ghosh Abhimani Glimpse Released

Updated On : October 7, 2024 / 7:27 AM IST

Abhimani : సీనియర్ జర్నలిస్ట్, నటుడు, సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న సురేష్ కొండేటి ఇప్పుడు మెయిన్ లీడ్ లో అభిమాని అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో అజయ్ ఘోష్, అక్సా ఖాన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. SK రెహమాన్, కంద సాంబశివరావు నిర్మాతలుగా రాంబాబు దోమకొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సురేష్ కొండేటి పుట్టిన రోజు నాడు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ రిలీజ్ చేసారు.

Also Read : Pawan Kalyan – Sayaji Shinde : పవన్ కళ్యాణ్ సర్ అపాయింట్మెంట్ ఇప్పించండి.. ఈ మంచి పని ఆయనతో చేయించాలి..

ఈ గ్లింప్స్ చూస్తుంటే భూలోకం, యమలోకం మధ్యలో జరిగే కథల కనిపిస్తుంది. ఇందులో అజయ్ ఘోష్ యముడిగా కనిపించబోతున్నాడు. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి..

 

ఇక ఈ గ్లింప్స్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా రిలీజ్ చేసారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అభిమాని అనే టైటిల్ బాగుంది. అభిమానులు అంటే హీరో సినిమాలను చూసి పేపర్లు ఎగరేయడమే కాదు వాళ్ళ లక్షణాలు తీసుకొని జీవితంలో పైకి రావాలి. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా ఎదిగారు. అందరి హీరోల అభిమానులు ఈ సినిమా చూడాలి అన్నారు.

Suresh Kondeti Ajay Ghosh Abhimani Glimpse Released
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. నా డిస్ట్రిబ్యూటర్ ప్రయాణం మొదలయింది రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాతోనే. ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్న నన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది రాఘవేంద్రరావు గారే. రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా నేను ప్రధాన పాత్ర పోషించిన ‘అభిమాని’ సినిమా గ్లింప్స్ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది అని తెలిపారు.