Santosham Awards : 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఈసారి ఘనంగా గోవాలో..

త్వరలో 22వ సారి సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా సంతోషం అధినేత సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ..

Suresh Kondeti Santosham Awards will held in Goa this Time

Santosham Awards : గత ఇరవై ఒక్క ఏళ్లుగా నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి(Suresh Kondeti) ఆధ్వర్యంలో సంతోషం అవార్డ్స్ ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం తెలుగులో మొదటిసారిగా ఓటీటీ అవార్డులు కూడా ఇచ్చారు. త్వరలో 22వ సారి సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ జరగనున్నాయి.

ఈ సంవత్సరం మరింత గ్రాండ్ గా గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంతోషం అధినేత సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్, డిసెంబర్ 2న గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం. నాకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ అవార్డులకు సహకరిస్తున్న అందరు హీరోలు, అభిమానులకి కృతజ్ఞతలు. సంతోషం ఓటీటీ అవార్డ్స్ కూడా గత ఏడాది మొట్టమొదటిగా మొదలుపెట్టింది సంతోషం సంస్థ. రెండవసారి ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తారీఖున ఓటీటీ అవార్డ్స్ ఇవ్వనున్నాం అని తెలిపారు.

అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. సంతోషం సంస్థ నుంచి 25 సంవత్సరాలు పాటు అవార్డులు కొనసాగించాలని అనుకున్నాను. ఈసారితో 22 సంవత్సరాలు. ఇంకో మూడు సంవత్సరాలు కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. సంతోషం మ్యాగజైన్ మొదలెట్టినప్పుడు నాకు ఇంకా చిన్న వయసు. నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు లాంటి అగ్ర నటీనటులందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ అవార్డ్స్ మొదలుపెట్టాను. టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు సంతోషం సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డ్స్ నిర్వహించగలడు అన్న ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నాను. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు లాంటి అగ్ర హీరోలు సురేష్ కొండేటి చేయగలడు అని నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఎక్కడ ఆగకుండా నిర్వహించాను, నిర్వహిస్తున్నాను అని అన్నారు.

Also Read : Bigg Boss 7 Day 65 : బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్.. హౌస్ లోకి ఎవరెవరు వచ్చారంటే? ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..

ఈసారి గోవాలో నిర్వహిస్తున్నందున గోవా గవర్నమెంట్ వాళ్ళు అందిస్తున్న సహకారం మర్చిపోలేనిది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు