Suresh Raina Beginnings New Innings make acting debut in Tamil film
టీమ్ఇండియా క్రికెటర్లు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని బంధం ఏదో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు క్రికెటర్లు సినిమాల్లో నటించి తమదైన ముద్రను వేశారు. ‘ఫ్రెండ్‌షిప్’ అనే తమిళ సినిమాలో హర్భజన్ సింగ్ నటించగా, విక్రమ్ హీరోగా వచ్చిన ‘కోబ్రా’ మూవీలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రను పోషించాడు. ఇక శ్రీశాంత్, వరుణ్ చక్రవర్తి వంటి క్రికెటర్లు కూడా తమిళ సినిమాల్లో నటించారు. ఇక తాజాగా వారి బాటలోనే పయనిస్తున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా. ఆయన ఓ తమిళ చిత్రంతో నటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నాడు.
డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. శరవణ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోగన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో సురేష్ రైనా హీరోగా నటిస్తున్నాడా? లేదంటే ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడా? అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది.
Sanju Samson : కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ శాంసన్ జాక్ పాట్.. వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా..
Welcoming Chinna Thala @ImRaina ❤️ on board for #DKSProductionNo1! 💥🗡️@Logan__you @Music_Santhosh @supremesundar @resulp @muthurajthangvl @sandeepkvijay_ @saravananskdks @TibosSolutions @kgfsportz #sureshraina #chinnathala #dreamknightstories pic.twitter.com/8FnkmNdIeY
— Dream Knight Stories Private Limited (@DKSoffl) July 4, 2025
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున చాలా ఏళ్ల పాటు సురేష్ రైనా ఆడాడు. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రజలు రైనా ముద్దుగా చిన్న తలా అని పిలుస్తూ ఉంటారు. సీఎస్‌కే మూడు ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 5వేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా రైనా నిలిచాడు.
38 ఏళ్ల సురేష్ రైనా.. టీమ్ఇండియా తరుపున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడాడు. ధోనికి ఎంతో సన్నిహితుడిగా ఉండే రైనా.. మహేంద్రుడు రిటైర్‌మెంట్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ కూడా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌లో తెరకెక్కిన మొదటి సినిమా ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (LGM) తమిళ్‌లోనే రూపొందింది. హరీశ్ కళ్యాణ్, ఇవానా, నదియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు.