Sanju Samson : కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ శాంస‌న్ జాక్ పాట్‌.. వేలంలో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా..

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ కేర‌ళ క్రికెట్ లీగ్‌(కేసీఎల్‌)లో చ‌రిత్ర సృష్టించాడు.

Sanju Samson : కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ శాంస‌న్ జాక్ పాట్‌.. వేలంలో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా..

Sanju Samson becomes most expensive player in KCL auction 2025

Updated On : July 5, 2025 / 12:37 PM IST

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ కేర‌ళ క్రికెట్ లీగ్‌(కేసీఎల్‌)లో చ‌రిత్ర సృష్టించాడు. కేసీఎల్ సీజ‌న్‌2 కోసం నిర్వ‌హించిన ఆట‌గాళ్ల వేలంలో రికార్డు స్థాయి ధ‌ర‌ను ద‌క్కించుకున్నాడు. శాంస‌న్‌ను రూ.26.80 ల‌క్ష‌లు వెచ్చించి కొచ్చి బ్లూ టైగ‌ర్స్ సొంతం చేసుకుంది.

రూ.3 లక్ష‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలో అడుగుపెట్టిన శాంస‌న్ కోసం ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి. చూస్తుండ‌గానే.. అత‌డి ధ‌ర 5, 10, 15, 20 ల‌క్ష‌లు దాటిపోయింది. చివ‌రికి కొచ్చి బ్లూ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో కేసీఎల్‌లో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా సంజూ నిలిచాడు. కాగా.. సంజూ కేసీఎల్‌లో ఆడ‌నుండ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

WI vs AUS : పాట్ క‌మిన్స్ సూప‌ర్ క్యాచ్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ క్యాచ్‌ల్లో ఒక‌టి.. వీడియో వైర‌ల్‌..

శాంస‌న్ కోసం కొచ్చి ఫ్రాంచైజీ త‌మ ప‌ర్స్‌లో స‌గానికి కంటే ఎక్కువ‌గానే ఖ‌ర్చు చేసింది. కేసీఎల్‌లో ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు మేనేజ్‌మెంట్ రూ.50ల‌క్ష‌లు మాత్ర‌మే కేటాయించింది. కొచ్చి సంజూ పైనే 26.80 ల‌క్ష‌లు వెచ్చించ‌డంతో ప్ర‌స్తుతం ఆ ఫ్రాంచైజీ వ‌ద్ద రూ.23.2ల‌క్ష‌లే మిగిలి ఉన్నాయి.

ENG vs IND : రెండో టెస్టులో వివాదం.. రివ్యూ కోరిన య‌శ‌స్వి జైస్వాల్‌.. అంపైర్‌తో గొడ‌వ‌కు దిగిన బెన్ స్టోక్స్‌.. వీడియో

సంజూ శాంస‌న్ టీమ్ఇండియా టెస్టు, వ‌న్డే జ‌ట్టులో రెగ్యుల‌ర్ స‌భ్యుడు కాదు.. కానీ టీ20ల్లో మాత్రం రెగ్యుల‌ర్ ఆట‌గాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుకు ఎటువంటి టీ20లు లేక‌పోవ‌డంతో కేసీఎల్ టోర్నీ మొత్తానికి సంజూ శాంస‌న్ అందుబాటులో ఉంటాడు. కెసీఎల్ సీజ‌న్‌2 ఆగస్టు 21 నుంచి సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.