ENG vs IND : రెండో టెస్టులో వివాదం.. రివ్యూ కోరిన య‌శ‌స్వి జైస్వాల్‌.. అంపైర్‌తో గొడ‌వ‌కు దిగిన బెన్ స్టోక్స్‌.. వీడియో

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగిస్తోంది.

ENG vs IND : రెండో టెస్టులో వివాదం.. రివ్యూ కోరిన య‌శ‌స్వి జైస్వాల్‌.. అంపైర్‌తో గొడ‌వ‌కు దిగిన బెన్ స్టోక్స్‌.. వీడియో

ENG vs IND 2nd Test Jaiswal DRS controversy Ben Stokes gets into heated exchange with umpire

Updated On : July 5, 2025 / 10:54 AM IST

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 407 ప‌రుగులకే ఔట్ చేసిన భార‌త్ 180 ప‌రుగుల మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్‌ను మొద‌లు పెట్టిన టీమ్ఇండియా మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 64 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28), క‌రుణ్ నాయ‌ర్ (7) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 244 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదిలా ఉంటే.. భార‌త రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స‌హ‌నం కోల్పోయాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్‌తో గొడ‌వ‌కు దిగాడు. ఈ ఘ‌ట‌న భార‌త రెండో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవ‌ర్‌లో చోటు చేసుకుంది.

Yashasvi Jaiswal : చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వి జైస్వాల్‌.. భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

ఈ ఓవ‌ర్‌ను పేసర్‌ జోష్ టంగ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని భార‌త బ్యాట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ షాట్ ఆడాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యాడు. బంతి బ్యాట్ ను కాకుండా అత‌డి ప్యాడ్ ను తాకింది. ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు ఎల్బీడ‌బ్ల్యూ అంటూ అప్పీల్ చేసిన వెంట‌నే అంపైర్ షర్ఫుద్దౌలా.. జైస్వాల్ ఔట్ అంటూ వేలు పైకెత్తాడు.

దీంతో నిరాశ చెందిన జైస్వాల్‌.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ వ‌ద్ద‌కు వెళ్లి.. డిఆర్ఎస్ తీసుకోవాలా? వ‌ద్దా అన్న విష‌యాన్ని సుదీర్ఘంగా చర్చించి చివరి క్షణంలో నిర్ణయాన్ని సమీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఇది ఇంగ్లాండ్ కెప్టెన్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు న‌చ్చ‌లేదు. జైస్వాల్ రివ్యూ కోర‌డానికి ముందే 15 సెక‌న్ల టైమ‌ర్ ముగిసింద‌ని అంపైర్‌తో గొడ‌వ‌కు దిగాడు.

ENG vs IND : బుమ్రా లేడు.. ఈరోజు కోస‌మే ఎదురుచూస్తున్నా.. డీఎస్పీ సిరాజ్ కామెంట్స్‌..

ఈ క్ర‌మంలో స్టోక్స్‌, అంపైర్ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. మొత్తానికి అంపైర్లు జైస్వాల్ రివ్యూను అంగీక‌రించారు. అయితే.. రిప్లేలో బంతి లెంగ్ స్టంప్ తాకిన‌ట్లుగా క‌నిపించాయి. థ‌ర్డ్ అంపైర్ కూడా ఫీల్డ్ అంపైర్ నిర్ణ‌యానికే క‌ట్టుబ‌ట్టాడు. దీంతో జైస్వాల్ మైదానాన్ని వీడ‌క త‌ప్ప‌లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 28 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. కాగా.. 10 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద జైస్వాల్ టెస్టుల్లో అత్యంత వేగంగా రెండు వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.