Yashasvi Jaiswal : చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

ENG vs IND 2nd Test Yashasvi Jaiswal breaks Sunil Gavaskar 49 year record in tests
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జైస్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
జైస్వాల్ కేవలం 21 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రికార్డును అధిగమించాడు. గవాస్కర్ 23 మ్యాచ్‌ల్లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ENG vs IND : బుమ్రా లేడు.. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నా.. డీఎస్పీ సిరాజ్ కామెంట్స్..
2⃣0⃣0⃣0⃣ Test runs & going strong 💪 💪
Joint-fastest for #TeamIndia to reach the milestone (by innings) along with Rahul Dravid and Virender Sehwag 🙌
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ybj_19 pic.twitter.com/sQ0wbRGmy1
— BCCI (@BCCI) July 4, 2025
ద్రవిడ్, సెహ్వాగ్ సరసన..
అయితే ఇన్నింగ్స్‌ల పరంగా చూసుకుంటే మాత్రం రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన జైశ్వాల్ నిలిచాడు. ద్రవిడ్, సెహ్వాగ్ టెస్టుల్లో రెండు వేల పరుగుల మైలురాయిని 40 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. జైస్వాల్ కూడా అన్నే ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ద్రవిడ్, సెహ్వాగ్‌లకు ఈ ఫీట్‌ను అందుకోవడానికి 25 మ్యాచ్‌లు అవసరం అయ్యాయి.
టెస్టుల్లో ఇన్నింగ్స్ ల పరంగా అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత ఆటగాళ్లు వీరే..
రాహుల్ ద్రవిడ్ – 40 ఇన్నింగ్స్‌ల్లో
వీరేంద్ర సెహ్వాగ్ – 40 ఇన్నింగ్స్‌ల్లో
యశస్వి జైస్వాల్ – 40 ఇన్నింగ్స్‌ల్లో
విజయ్ హజారే – 43 ఇన్నింగ్స్‌ల్లో
గౌతమ్ గంభీర్ – 43 ఇన్నింగ్స్‌ల్లో
సునీల్ గవాస్కర్ – 44 ఇన్నింగ్స్‌ల్లో
Ravindra Jadeja : రవీంద్ర జడేజా కీలక వ్యాఖ్యలు.. నా సమయం ముగిసింది..
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే.. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ కేవలం 15 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. జార్జ్ హెడ్లీ (17), హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (22),మైఖేల్ హస్సీ (20), మార్నస్ లబుషేన్(20) ఆ తరువాత వరుసగా ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 22 బంతుల్లో 6 ఫోర్లు బాది 28 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28), కరుణ్ నాయర్ (7)లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతక ముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.