Suriya Casts His Vote For Oscars95
Oscars95: ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మరికొద్ది రోజుల్లో జరగనుండటంతో అందరిచూపులు ఈ అవార్డలుపై ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిన సినిమాల్లో నుండి అత్యుత్తమ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను ఈ అవార్డుల జాబితాలో ఉంచింది ఆస్కార్ జ్యూరీ. ఇక ఈసారి ఆస్కార్ అవార్డులు భారతీయులకు మరింత ప్రత్యేకం.
Oscars 2023 : ఆస్కార్ అవార్డుల వేడుక ఓటిటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు..
దానికి కారణం, తెలుగులో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుండి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడమే. ఒక తెలుగు పాట నేరుగా ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతుండటంతో ఈసారి అవార్డు ఖచ్చితంగా మనదే అంటున్నారు ఇండియన్స్. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 12న జరగనుండగా, తాజాగా ఈ అవార్డుల కోసం జ్యూరీ మెంబర్స్ ఓటింగ్ చేస్తున్నారు. ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య, ఈమేరకు తన ఓటు వేసినట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
Oscars 2023 : వారం రోజుల్లో ఆస్కార్ వేడుకలు.. ఎక్కడ? ఏ టైంకి తెలుసా?? లైవ్ ఎందులో చూడాలి?
దీంతో సూర్య తన ఓటును దేనికి వేశాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలవాలని అభిమానులు కోరుతున్నారు. మరి ఇండియన్ సినిమా ఈసారి ఆస్కార్ అవార్డును అందుకుంటుందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది.
Voting done! #Oscars95 @TheAcademy pic.twitter.com/Aob1ldYD2p
— Suriya Sivakumar (@Suriya_offl) March 8, 2023