Suriya Kanguva first day collections
Kanguva collections : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్డ్స్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే.. సూర్య నటనకు విశేష స్పందన వచ్చింది. ఇక మొదటి రోజు ఈ చిత్ర కలెక్షన్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.58.62 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను పంచుకుంది.
పీరియాడిక్ యాక్షన్ కథతో పాటు ప్రస్తుత కాలానికి చెందిన కథ కలుపుతూ కంగువ సినిమాని తెరకెక్కించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, కోవై సరళ.. పలువురు కీలక పాత్రలను పోషించారు.
Like a wild storm in the box offices worldwide 💥 Lauded by all, our #Kanguva collects over 58.62 Crores ✨
Thank you to all the Anbaana Fans, Cinema Lovers and Audiences who made this happen💖 #KanguvaRunningSuccessfully 🗡️
Book your tickets here https://t.co/aG93NEBPMQ… pic.twitter.com/ZySlw6zLa1— Studio Green (@StudioGreen2) November 15, 2024