Allu Arjun Mother : చిరంజీవి గారిని అలా చూసి బన్నీ కూడా హీరో అవ్వాలని అనుకునే దాన్ని.. బన్నీ తల్లి వ్యాఖ్యలు..

అసలు అల్లు అర్జున్ హీరో అవుతారని మీరు ఎప్పుడు అనుకున్నారు అని బాలయ్య అడిగారు.

Allu Arjun Mother : చిరంజీవి గారిని అలా చూసి బన్నీ కూడా హీరో అవ్వాలని అనుకునే దాన్ని.. బన్నీ తల్లి వ్యాఖ్యలు..

Allu Arjun Mother Nirmala Interesting Comments on Chiranjeevi and Allu Arjun

Updated On : November 15, 2024 / 4:10 PM IST

Allu Arjun Mother : తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షో నాలుగవ ఎపిసోడ్ రిలీజయింది. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ వచ్చి సందడి చేసారు. బాలయ్య – అల్లు అర్జున్ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. బోలెడన్ని విషయాలు తెలిపారు. అయితే ఈ ఎపిసోడ్ చివర్లో అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా వచ్చారు.

బాలయ్య అల్లు అర్జున్ తల్లి నిర్మలకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇక ఆవిడ అల్లు అర్జున్ చిన్నతనం గురించి, అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య గురించి మాట్లాడారు. ఈ క్రమంలో బాలయ్య ఆమెను కూడా పలు ప్రశ్నలు అడిగారు. అసలు అల్లు అర్జున్ హీరో అవుతారని మీరు ఎప్పుడు అనుకున్నారు అని బాలయ్య అడిగారు.

Also Read : Pushpa 3 : అమ్మో పుష్ప 3 నేను చేయలేను.. బాలయ్య షోలో పుష్ప 3 పై అల్లు అర్జున్ కామెంట్స్..

ఇందుకు అల్లు అర్జున్ తల్లి నిర్మల సమాధానమిస్తూ.. చిరంజీవి గారి 100 డేస్, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ జరిగేవి. వాటికి అల్లు అరవింద్ గారు కూడా వెళ్లేవారు. ఆ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు బన్నీ కూడా ఇలా అయితే బాగుండు అని వాడు చిన్నప్పట్నుంచి అనుకునేదాన్ని. ఎందుకో తెలీదు కానీ మిగిలిన వాళ్ళ గురించి అలా అనుకోలేదు. చిరంజీవి ఈవెంట్స్ చూస్తూ అలా బన్నీ గురించి హీరో అవ్వాలని అనుకునేదాన్ని అని తెలిపారు. దీంతో అల్లు అర్జున్ తల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.