Pushpa 3 : అమ్మో పుష్ప 3 నేను చేయలేను.. బాలయ్య షోలో పుష్ప 3 పై అల్లు అర్జున్ కామెంట్స్..

పుష్ప సినిమాకు పార్ట్ 3 కూడా ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి.

Pushpa 3 : అమ్మో పుష్ప 3 నేను చేయలేను.. బాలయ్య షోలో పుష్ప 3 పై అల్లు అర్జున్ కామెంట్స్..

Allu Arjun Comments on Pushpa 3 in Balakrishna Unstoppable Show

Updated On : November 15, 2024 / 3:44 PM IST

Pushpa 3 : అల్లు అర్జున్ కెరీర్లోనే పుష్ప సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా వైడ్ స్టార్ డమ్ వచ్చింది. దీంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి.

నిర్మాతలు కూడా ఇటీవల దీనిపై మాట్లాడుతూ పార్ట్ 3 కు ఛాన్స్ ఉంది కానీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని చెప్పారు. దీంతో పుష్ప 3 కూడా ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. తాజాగా అల్లు అర్జున్ ఆహా ఓటీటీ బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకి వచ్చారు. ఈ షోలో పుష్ప 3 ప్రస్తావన వచ్చింది.

Also Read : Allu Ayaan – Arha : బాలయ్య అన్‌స్టాప‌బుల్ షోలో అల్లు అర్జున్ పిల్లలు.. తగ్గేదేలే అంటున్న అయాన్..

బాలయ్య పుష్ప 3 కూడా ఉందా అని అడగ్గా అల్లు అర్జున్.. పుష్ప 3 నా అమ్మో నేను చేయలేను. ఒకవేళ చేసినా ఇప్పట్లో చేయలేను అని అన్నారు. దీంతో బన్నీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప 2 పార్ట్స్ కోసం ఆల్మోస్ట్ 4 ఏళ్ళు సమయం ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ 3 అంటే ఇంకో రెండు, మూడేళ్లు ఇవ్వాల్సి వస్తుందని అలా అన్నారేమో బన్నీ. అయితే ఫ్యూచర్ లో కొన్ని సినిమాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ వేరే సినిమాల కమిట్మెంట్స్ అయ్యాక పుష్ప 3 ఉండొచ్చేమో చూడాలి.