Suriya Kanguva Movie have two stories including Flash Back
Kanguva Movie : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), తమిళ మాస్ డైరెక్టర్ శివ కంబినేషనల్ లో వస్తున్న సినిమా ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో బాహుబలి, KGF చిత్రాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం చెబుతాం అంటూ మూవీ ప్రొడ్యూసర్స్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో మూవీ ఎలా ఉండబోతుందో అని ఇతర పరిశ్రమల్లో కూడా ఆసక్తి నెలకుంది.
ఇటీవల జులై 23న సూర్య పుట్టినరోజు నాడు చిత్ర యూనిట్ మూవీ నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాలు పాటు ఉన్న గ్లింప్స్ లో కంగువ టైటిల్ సాంగ్ తో నడిపించారు. యుద్ధ సన్నివేశాలు చూపిస్తూ గ్లింప్స్ చివరిలో సూర్య.. ‘కుశలమా’ అంటూ వైల్డ్ గా అడుగుతూ భయపెడుతున్నాడు. మొత్తానికి గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునే లాగానే ఉంది. అడివి వీరుడు సూర్య కనిపించబోతున్నాడు. దానికి తగ్గట్టే సూర్య లుక్స్ చాలా వైల్డ్ గా ఉన్నాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగులో కూడా కంగువ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Dhoni : హీరోగా మహేంద్ర సింగ్ ధోని.. అలాంటి కథ అయితే ధోని రెడీ అంటున్న సాక్షి..
తాజాగా ఈ సినిమా నిర్మాతలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కంగువా సినిమా కేవలం పీరియాడికల్ మాత్రమే కాదు. ప్రస్తుత సమయానికి తగిన కథ కూడా ఉంటుంది. గ్లింప్స్ లో చూసింది ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. సూర్య, దిశా పటాని మధ్య గోవాలో కథ జరుగుతుంది అని తెలిపారు. నిర్మాతలు చెప్పిన దాని బట్టి కంగువలో రెండు కథలు ఉండబోతున్నట్టు, గ్లింప్స్ లో చూపించింది ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు తెలుస్తుంది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాని తమిళ స్టార్ ప్రొడ్యూసర్ KE జ్ఞానవేల్ రాజాతో పాటు ప్రభాస్ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ కూడా కలిపి నిర్మిస్తుంది.