suriya Kanguva Second yolo out now
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో దిశా పటాని కథానాయిక. బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు విశేష స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. Yolo అంటూ ఈ పాట సాగుతోంది. మొత్తం ఇంగ్లీష్‌లోనే ఈ పాట సాగుతోంది.
Samudrudu Movie Team : ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో 20 శాతం పేద మత్స్యకారులకు ఇస్తాం..