Kanguva Twitter Review : సూర్య ‘కంగువా’ ట్విట్ట‌ర్‌ రివ్యూ.. మూవీ హిట్టా? ఫ‌ట్టా? అంటే?

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటించిన మూవీ ‘కంగువా’.

Suriya Kanguva Twitter Review

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటించిన మూవీ ‘కంగువా’. శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఫిలింగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టులు దిశా ప‌టానీ, బాబీ డియోల్‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నేడు (న‌వంబ‌ర్ 14న‌) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో షోలు ప‌డ్డాయి. మ‌రి సోష‌ల్ మీడియా వేదిక‌గా కంగువాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో ఓ సారి చూద్దాం. సూర్య ఖాతాలో హిట్ ప‌డిందా? లేదా? నెటిజ‌న్ల అభిప్రాయం ఏంటి అన్న‌ది చూద్దాం.. ఈ చిత్రంలో సూర్య యాక్టింగ్ అదిరిపోయింద‌ని అంటున్నారు. ఇక ఇంట్రక్ష‌న్ సీన్స్ నెక్స్ట్ లెవ‌ల్ అని, వీఎఫ్ఎక్స్‌, యాక్ష‌న్ సీన్స్ బాగున్నాయ‌ని అంటున్నారు. ఇక క్లైమాక్స్ ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. సినిమాలో కొన్ని చోట్ల నెమ్మ‌దించింద‌ని చెబుతున్నారు.