Suriya 44 : ‘కంగువ’ తర్వాత సూర్య నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా? హార్ట్ బ్రేక్ పోస్టర్ తో..

కంగువ లాంటి భారీ బడ్జెట్, పీరియాడిక్ సినిమా తర్వాత రాబోయే సినిమాని తాజాగా ప్రకటించాడు సూర్య.

Suriya Next Movie After Kanguva Announced Under Karthik Subbaraju Direction

Suriya 44 : తమిళ్ స్టార్ హీరో సూర్య ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇటీవల సూర్య ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కొత్త కొత్త కథలతో వస్తున్నాడు. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కంగువ గ్లింప్స్ రిలీజయి సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమా కోసం తమిళనాడులోనే కాక పాన్ ఇండియా ఎదురుచూస్తున్నారు.

కంగువ లాంటి భారీ బడ్జెట్, పీరియాడిక్ సినిమా తర్వాత రాబోయే సినిమాని తాజాగా ప్రకటించాడు సూర్య. సూర్య నెక్స్ట్ సినిమాని తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ మీద.. ఓ చెట్టుకి హార్ట్ సింబల్ వేసి అది బ్రేక్ చేసినట్టు ఉంది. లవ్ తో పాటు కామెడీ, యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ పాటలో రామ్ చరణ్ డ్రెస్సుపై ఇది గమనించారా? ఇదెక్కడి క్రియేటిటివిటి రా నాయనా?

ఇది సూర్య 44వ సినిమాగా రానుంది. ప్రస్తుతం సూర్య కంగువ చివరి దశ షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా అయ్యాక సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమా షూట్ మొదలుపెడతాడు. ఇటీవలే జిగర్తాండ డబల్ ఎక్స్ సినిమాతో హిట్ కొట్టిన కార్తీక్ సుబ్బరాజు కంగువ తర్వాత సూర్య సినిమా అంటే ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఇక కంగువ సినిమా ఈ సంవత్సరం చివరి వరకు రిలీజ్ అవ్వొచ్చు అని సమాచారం.