Site icon 10TV Telugu

Retro Twitter Review : రెట్రో ట్విట్టర్ రివ్యూ.. సూర్యకి హిట్టు పడిందా?

Suriya Retro Twitter Review

Suriya Retro Twitter Review

త‌మిళ స్టారో సూర్య‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతుంటాయి. మొన్నామ‌ధ్య కంగువా మూవీతో వ‌చ్చిన సూర్య ఆశించిన స్థాయితో అల‌రించ‌లేక‌పోయాడు. తాజాగా ఆయ‌న రెట్రో మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ రిలీజ్ చేశారు. మే డే సంద‌ర్భంగా నేడు (గురువారం) ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమాతోనైనా సూర్య సాలీడ్ హిట్ అందుకున్నాడో లేదో ఓసారి చూద్దాం..

ఈ చిత్రాన్ని చూసిన కొంద‌రు సోష‌ల్ మీడియాలో త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రంలో సూర్య స్క్రీన్ ప్రజెన్స్ అద‌రిపోయింద‌ని అంటున్నారు. సూర్య పవర్ ప్యాకింగ్ పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయ‌ని చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంద‌ని, క్లైమాక్స్ అయితే అదిరిపోయిందని కొంద‌రు ఫ్యాన్స్ అంటున్నారు. సంతోష్ నారాయణన్ బీజీఎమ్ సీన్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉందని అంటున్నారు.

Shah Rukh – Deepika : షారుఖ్ తో ఇప్పటికే అయిదుసార్లు.. ఇప్పుడు ఆరోసారి హిట్ ఇవ్వడానికి రెడీ అయిన దీపికా..

ఈ చిత్రం గురించి నెటిజన్లు ఏమ‌న్నారో ఓ సారి చూడండి..

Exit mobile version