Shah Rukh – Deepika : షారుఖ్ తో ఇప్పటికే అయిదుసార్లు.. ఇప్పుడు ఆరోసారి హిట్ ఇవ్వడానికి రెడీ అయిన దీపికా..

ప్రజెంట్ షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ మూవీలో నటిస్తున్నారు.

Shah Rukh – Deepika : షారుఖ్ తో ఇప్పటికే అయిదుసార్లు.. ఇప్పుడు ఆరోసారి హిట్ ఇవ్వడానికి రెడీ అయిన దీపికా..

Deepika Padukone Again Playing Key Role in Shah Rukh Khan Movie

Updated On : April 30, 2025 / 9:26 PM IST

Shah Rukh Khan – Deepika Padukone : కింగ్ షారుఖ్ ఖాన్ హిట్ పెయిర్ లిస్ట్ లో ఎందరు హీరోయిన్స్ ఉన్నా టాప్ ప్లేస్ లో వినిపించే పేరు కాజోల్ దే. ఆ తర్వాత అంతటి క్రేజ్ ఆడియెన్స్ లో హైప్ అండ్ అటెన్షన్ సొంతం చేసుకున్న హీరోయిన్ గా షారుఖ్ కు హిట్ జోడీ అనిపించుకున్నారు దీపికా పదుకొనే. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేశారు ఈ హిట్ పెయిర్. ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు షారుఖ్ – దీపికా.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 2023లో వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. పఠాన్, జవాన్, డుంకీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ కలెక్షన్స్ సాధించి షారుఖ్ స్టామినా ఏంటో మరోసారి చూపించాయి.

Also Read : Directors : వామ్మో.. డైరెక్టర్స్ కూడా కోట్లల్లో రెమ్యునరేషన్స్..? వీళ్ళ రెమ్యునరేషన్స్ తెలిస్తే కళ్ళు చెదిరిపోతాయి అంతే..

ప్రజెంట్ షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ మూవీలో నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొనే మరోసారి కింగ్ ఖాన్ షారుఖ్ తో నటిస్తున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.

బాలీవుడ్ హిట్ జోడీ షారుక్-దీపికా పదుకొనేల కాంబోలో ఇప్పటి వరకు 5 సినిమాలు వచ్చాయి. వాటిలో హ్యాపీ న్యూ ఇయర్ యావరేజ్ అవ్వగా ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, పఠాన్, జవాన్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రజెంట్ షారుఖ్ చేస్తోన్న కింగ్ మూవీలో హీరోయిన్ గా కాకుండా ఓ ఇంపార్టెంట్ రోల్ లో దీపికా నటిస్తున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. మళ్ళీ కాస్త గ్యాప్ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న షారుఖ్ – దీపిక బాక్సాఫీస్ దగ్గర మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్.

Also Read : Hideo Kojima : మహేష్ సినిమాకు జపాన్ వీడియో గేమ్ డిజైనర్..? రాజమౌళి వీడియో కాల్.. ఫోటో వైరల్..