Hideo Kojima : మహేష్ సినిమాకు జపాన్ వీడియో గేమ్ డిజైనర్..? రాజమౌళి వీడియో కాల్.. ఫోటో వైరల్..

నేడు రాజమౌళి జపాన్ వీడియో గేమ్ డిజైనర్ హిదేవు కొజిమతో వీడియో కాల్ లో మాట్లాడాడు.

Hideo Kojima : మహేష్ సినిమాకు జపాన్ వీడియో గేమ్ డిజైనర్..? రాజమౌళి వీడియో కాల్.. ఫోటో వైరల్..

Rajamouli Video Call to Japan Star Video Game Designer Hideo Kojima he Shares Photo

Updated On : April 30, 2025 / 7:03 PM IST

Hideo Kojima : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. తాజాగా జపాన్ స్టార్ వీడియో గేమ్ డిజైనర్ షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. నేడు రాజమౌళి జపాన్ వీడియో గేమ్ డిజైనర్ హిదేవు కొజిమతో వీడియో కాల్ లో మాట్లాడాడు. హిదేవు కొజిమ వీడియో కాల్ లో మాట్లాడటం ఫోటో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Rajamouli Video Call to Japan Star Video Game Designer Hideo Kojima he Shares Photo

రాజమౌళికి జపాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. బాహుబలి, RRR సినిమాలతో జపాన్ లో రాజమౌళికి కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అక్కడ టెక్నిషియన్స్ కూడా రాజమౌళికి ఫిదా అయ్యారు. రాజమౌళి కూడా అక్కడ చాలా మంది సాంకేతిక నిపుణులను కలిసాడు. మహేష్ సినిమాకు VFX పార్ట్ చాలా ఉంటుంది వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ స్టార్ వీడియో గేమ్ డిజైనర్ తో సినిమా వర్క్ కోసమే రాజమౌళి మాట్లాడాడు అంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కాల్ లో రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఉన్నాడు.

Also Read : Manchu Vishnu – Sree Vishnu : మంచు విష్ణుకి సారీ చెప్పిన శ్రీవిష్ణు.. ‘కన్నప్ప’ టీమ్ హర్ట్ అయ్యారంట అంటూ.. ‘సింగిల్’ ట్రైలర్ పై కామెంట్స్..

హిదేవు కొజిమ జపాన్ లో స్టార్ వీడియో గేమ్ డిజైనర్, రైటర్, డైరెక్టర్, నిర్మాత. అలాంటి వ్యక్తితో రాజమౌళి వీడియో కాల్ మాట్లాడటంతో ఎందుకు అని చర్చగా మారింది.