Manchu Vishnu – Sree Vishnu : మంచు విష్ణుకి సారీ చెప్పిన శ్రీవిష్ణు.. ‘కన్నప్ప’ టీమ్ హర్ట్ అయ్యారంట అంటూ.. ‘సింగిల్’ ట్రైలర్ పై కామెంట్స్..

ఏం జరిగిందో ఏమో కానీ శ్రీవిష్ణు మొత్తానికి సారీ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసాడు.

Manchu Vishnu – Sree Vishnu : మంచు విష్ణుకి సారీ చెప్పిన శ్రీవిష్ణు.. ‘కన్నప్ప’ టీమ్ హర్ట్ అయ్యారంట అంటూ.. ‘సింగిల్’ ట్రైలర్ పై కామెంట్స్..

Sree Vishnu Says Sorry to Manchu Vishnu and Kannappa Movie Team Regarding Single Trailer Issue

Updated On : April 30, 2025 / 6:36 PM IST

Manchu Vishnu – Sree Vishnu : శ్రీవిష్ణు మే 9న సింగిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఆ ట్రైలర్ లో శ్రీవిష్ణు శివయ్యా.. అనే ఓ డైలాగ్, మంచు కురిసిపోవడం అనే ఓ డైలాగ్ ని చెప్పాడు. ఈ రెండిటిపై మంచి విష్ణు హార్ట్ అయ్యాడట. మంచు విష్ణు కన్నప్ప టీజర్ లో శివయ్యా.. అనే డైలాగ్ ఉండగా అది బాగా ట్రోల్ అయింది. అలాగే సింగిల్ ట్రైలర్ లో లాస్ట్ లో ఓ బూతు పదం ప్లేస్ లో మంచు కురిసిపోవడం అని వాడటంతో తన ఇంటిపేరుని అలా వాడాడు అని కూడా విష్ణు హార్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి.

ఈ రెండు డైలాగుల విషయంలో మంచు విష్ణు హార్ట్ అయినట్టు, శ్రీవిష్ణు పై, మూవీ యూనిట్ పై టాలీవుడ్ పెద్దలకు, ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే మూవీ యూనిట్ పై కూడా సీరియస్ అయ్యారట విష్ణు. మూవీ యూనిట్ కి కాల్ చేసి ఆ డైలాగ్స్ తీసేయాలని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఏం జరిగిందో ఏమో కానీ శ్రీవిష్ణు మొత్తానికి సారీ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసాడు.

Also Read : Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మళ్ళీ ముద్దులతో రౌడీ హీరో..

ఈ వీడియోలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. మా సింగిల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నప్ప టీమ్ మేము వాడిన డైలాగ్స్ కి హార్ట్ అయ్యారని తెలిసింది. అది కావాలని చేసింది కాదు. తప్పుగా కన్వే అయింది. మేము ఇమిడియట్ గా స్పందించి ఆ డైలాగ్స్ తీసేస్తున్నాము. ఆ డైలాగ్స్ సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దామనే ఉద్దేశం అయితే లేదు. ప్రజెంట్ జనరేషన్ వాడే సినిమా రిఫరెన్స్ లు, మీమ్స్ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాసెస్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అరవింద్ గార్ల డైలాగ్స్ కూడా వాడాము. ఒక పాజిటివ్ గానే కామెడిగానే ఇవన్నీ చేసాము. అలాంటివి మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారీ. అలాంటివి ఎక్కువ రాకుండా చూసుకుంటాము. ఇండస్ట్రీ అంతా కూడా ఒక ఫ్యామిలీ. ఇలాంటివి ఏమైనా ఇబ్బంది పెడితే సారీ. ఇండస్ట్రీ అంతా ఒకటే. హర్ట్ అయిన వాళ్లందరికీ సారీ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే విష్ణు టీం ఇలా సారీ చెప్తూ శ్రీవిష్ణుని వీడియో రిలీజ్ చేయమన్నారని, సీరియస్ అయ్యారని అందుకే శ్రీవిష్ణు సారీ చెప్పాడని తెలుస్తుంది. అయితే పలువురు శ్రీవిష్ణు ఫ్యాన్స్ ఆయన సినిమాల్లో రెగ్యులర్ గా ఇలాంటివి ఉంటాయి, సినిమాని సినిమాలాగా, కామెడీని కామెడీలాగా తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Sudheer : సుడిగాలి సుధీర్ చంకెక్కిన లేడీ కమెడియన్.. ఇద్దరు భామల మధ్యలో సుధీర్.. టీవీ షోలో రచ్చ.. ప్రోమో వైరల్..

శ్రీవిష్ణు సింగల్ ట్రైలర్ ఇక్కడ చూసేయండి..