Sudheer : సుడిగాలి సుధీర్ చంకెక్కిన లేడీ కమెడియన్.. ఇద్దరు భామల మధ్యలో సుధీర్.. టీవీ షోలో రచ్చ.. ప్రోమో వైరల్..
సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక షో వస్తుంది.

Sudigali Sudheer Anchor Sravanthi Ashu Reddy Family Stars Promo goes Viral
Sudheer : ఇటీవల కొన్ని టీవీ షోలలో మాటలు, డబల్ మీనింగ్ డైలాగ్స్, నటీనటుల బిహేవియర్ కాస్త శృతిమించుతోంది. అయినా అదే కామెడీ అనుకుంటూ టెలికాస్ట్ చేస్తున్నారు. టీఆర్పీల కోసం ఛానల్స్ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు. తాజాగా సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ ప్రోమోలో కాస్త ఓవర్ యాక్షన్ చేసారని ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు.
సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక షో వస్తుంది. ఈ షోలో యాంకర్ స్రవంతి, అషురెడ్డి, జబర్దస్త్ పవిత్ర ప్రతి ఎపిసోడ్ లో ఉండి ఎంటర్టైన్ చేస్తారు. రీసెంట్ గా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజయింది.
Also Read : Ram Charan : ‘పెద్ది’ సినిమా షూట్ కి 20 రోజులు బ్రేక్.. లండన్ వెళ్ళబోతున్న చరణ్.. అక్కడ ఎన్టీఆర్ తో కలిసి..
ఈ ప్రోమోలో యాంకర్ స్రవంతి – అషురెడ్డి ఇద్దరూ డ్యాన్స్ వేస్తూ మధ్యలో సుధీర్ ని లాగి కాస్త ఓవర్ గా ప్రవర్తించడంతో ఏంటి ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇదే ప్రోమోలో జబర్దస్త్ పార్వతి ఏకంగా ఎగిరి సుధీర్ చంకెక్కింది. అలా రెండు సార్లు చేసింది. దీంతో అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయినా అదే కామెడీ అన్నట్టు ప్రోమోని ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారగా షోలో మరీ శృతిమించుతున్నారు అని, కామెడీ అని చెప్పి ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి..
https://www.youtube.com/watch?v=6oYNYNgLoEc
Also Read : Rithu Chowdary : ఫ్రెండ్ తో కలిసి.. గోవాలో ఎంజాయ్ చేస్తున్న రీతూ చౌదరి.. ఫొటోలు చూశారా..?