Rajamouli Video Call to Japan Star Video Game Designer Hideo Kojima he Shares Photo
Hideo Kojima : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. తాజాగా జపాన్ స్టార్ వీడియో గేమ్ డిజైనర్ షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. నేడు రాజమౌళి జపాన్ వీడియో గేమ్ డిజైనర్ హిదేవు కొజిమతో వీడియో కాల్ లో మాట్లాడాడు. హిదేవు కొజిమ వీడియో కాల్ లో మాట్లాడటం ఫోటో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
రాజమౌళికి జపాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. బాహుబలి, RRR సినిమాలతో జపాన్ లో రాజమౌళికి కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అక్కడ టెక్నిషియన్స్ కూడా రాజమౌళికి ఫిదా అయ్యారు. రాజమౌళి కూడా అక్కడ చాలా మంది సాంకేతిక నిపుణులను కలిసాడు. మహేష్ సినిమాకు VFX పార్ట్ చాలా ఉంటుంది వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ స్టార్ వీడియో గేమ్ డిజైనర్ తో సినిమా వర్క్ కోసమే రాజమౌళి మాట్లాడాడు అంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కాల్ లో రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఉన్నాడు.
హిదేవు కొజిమ జపాన్ లో స్టార్ వీడియో గేమ్ డిజైనర్, రైటర్, డైరెక్టర్, నిర్మాత. అలాంటి వ్యక్తితో రాజమౌళి వీడియో కాల్ మాట్లాడటంతో ఎందుకు అని చర్చగా మారింది.