Suriya telugu fans passed away due to current shock on arranging birthday banners
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బర్త్ డే ఈరోజు కావడంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టినరోజు వేడుకలు కనిపిస్తున్నాయి. రజినీకాంత్ తరువాత తెలుగులో మళ్ళీ సూర్య అంతటి అభిమానాన్ని అందుకున్నాడు. ఈ హీరో సినిమా వస్తుంది అంటేనే కాదు పుట్టినరోజుని కూడా ఫ్లెక్సీలు కట్టి సెలబ్రేట్ చేస్తుంటారు ఇక్కడ అభిమానులు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు అభిమానులు మృతి చెందారు.
Mouni Roy : హాస్పిటల్‌లో హీరోయిన్.. 9 రోజులు చాలా బాధపడ్డాను..
వివరాల్లోకి వెళ్తే.. సూర్య పుట్టినరోజు సందర్భంగా మోపువారిపాలెంకి చెందిన ముగ్గురు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్ కి గురైయ్యారు. ఈ ప్రమాదంలో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడక్కడే మరణించారు. మరో అతను తీవ్ర గాయాలు పాలయ్యాడు. అతని వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణం ఏంటని దర్యాప్తు చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడే ఇలా ఇద్దరు అభిమానులు మరణించడం తోటి అభిమానులకు బాధని కలిగిస్తుంది.
Nara Rohit : నారా రోహిత్ కొత్త మూవీ అనౌన్స్‌మెంట్.. ప్రతినిధి సీక్వెలా..?
ఇక బర్త్ డే కావడంతో సూర్య నటిస్తున్న కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ కంగువ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో సూర్య చాలా వైల్డ్ గా కనిపించాడు. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని (Disha Patani) ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య మొత్తం ఐదు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మొత్తం పది భాషల్లో ఈ సినిమాని 2024 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయబోతున్నారు.