Sushmita Konidela : మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం పవన్ బాబాయే.. చిరు కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు..

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే నిర్మాణ సంస్థను నడిపిస్తుంది.(Sushmita Konidela)

Sushmita Konidela

Sushmita Konidela : పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీలో ఉన్న ఈ జనరేషన్ కజిన్స్ అందరికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పవన్ కెరీర్ మొదలు పెట్టకముందు ఇంట్లో పిల్లలు అందర్నీ తనే చూసుకునే వాడు అని పవన్, చిరు, చరణ్.. పలు సందర్భాలలో తెలిపారు. దీంతో మెగా ఫ్యామిలీ లో ఉన్న పిల్లు అంతా పవన్ కి బాగా క్లోజ్.(Sushmita Konidela)

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే నిర్మాణ సంస్థను నడిపిస్తుంది. తన నిర్మాణ సంస్థలో ఇప్పుడు చిరు – అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కిస్తుంది. తాజాగా సుస్మిత ఓ టీవీ షోకి గెస్ట్ గా హాజరైంది. ఈ షోలో మీ పవన్ కళ్యాణ్ బాబాయ్ గురించి ఏదైనా ఆసక్తికర విషయం, మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పమని అడిగారు.

Also Read : Rajinikanth : పవన్ కళ్యాణ్ గురించి.. రజినీకాంత్ సునీల్ కి ఏం చెప్పారో తెలుసా..?

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ఆయనతో మేము చిన్నప్పట్నుంచి కలిసి పెరిగాము. నాకు చరణ్ కి మధ్య గొడవలు ఉండవు. మేము బాగానే కలిసి ఉంటాము. మా ఇద్దరికీ గొడవలు వచ్చాయి అంటే అది బాబాయ్ వల్లే. అప్పట్లో టీవీలో అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. ఆయనకు బోర్ కొట్టినప్పుడల్లా నాకు, చరణ్ కి మధ్య ఏదో ఒకటి వదులుతారు. మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాము ఆయన చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని నవ్వుతూ చిన్నప్పటి సంగతి తెలిపింది.

 

Also Read : Dharma : సినిమాల్లో హీరోగా సక్సెస్.. పోలీస్ కేసు పెట్టిన భార్య..