Sushmita Konidela
Sushmita Konidela : అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ కూడా చేసారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో నిర్మాతగా నిర్మిస్తుంది.(Sushmita Konidela)
నేడు మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. తండ్రి చిరంజీవితో పాటు తమ్ముడు రామ్ చరణ్ కి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. చరణ్ చాలా సపోర్ట్ చేస్తాడని, నాతో ఎప్పుడూ ఉంటాడని గొప్పగా చెప్పింది. చరణ్ గురించి చెప్పడంతో హాల్ దద్దరిల్లిపోయింది. జనాలు అరుపులతో సందడి చేసారు.
దీంతో చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. సుస్మిత చరణ్ గురించి మాట్లాడుతుంటే చిరంజీవి ఎమోషనల్ అయిన వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా సుస్మిత స్పీచ్ వినేయండి..
Also See : Ashika Ranganath : ఆషికా రంగనాథ్ అందాలు.. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ లాంచ్ లో మెరుపులు..